ants: ఈ ఒక్కదాంతో ఇంట్లో చీమలు లేకుండా పోతాయి

Published : Aug 14, 2025, 10:19 AM IST

కాలమేదైనా ఇంట్లో ఏదో ఒక మూలన చీమలు పక్కాగా ఉంటాయి. ముఖ్యంగా వంటింట్లో అయితే కుప్పలు కుప్పలుగా తిరుగుతుంటాయి. మరి వీటిని ఇంట్లో లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
14
చీమలు

ఇంట్లో దోమలు ఉండటం ఎంత కామనో, చీమలు ఉండటం కూడా కామనే. సీజన్ ఏదైనా సరే ఇంట్లో చీమలు తిరుగుతూనే ఉంటాయి. అవి నల్లచీమలైనా, ఎర్ర చీమలైనా కావొచ్చు. ఇవి ఎక్కువగా వంటింట్లోనే కనిపిస్తుంటాయి. చక్కెర, బెల్లంతో పాటుగా రకరకాల ఆహార పదార్థాలను పాడుచేస్తుంటాయి. అయితే చాలా మంది ఈ చీమల బెడదను వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చీమలు ఏదో ఒక చోటు నుంచి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లోకి ఒక్క చీమ కూడా రాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
చీమలను తరిమికొట్టే చిట్కాలు

డెటాల్, ఇంగువ స్ప్రే

డెటాల్, ఇంగువ స్ప్రేతో ఇంట్లో చీమలు లేకుండా చేయొచ్చు. చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు, ముఖ్యంగా వంటింట్లో ఈ స్ప్రే చేస్తే చీమలు అస్సలు కనిపించవు. మరి ఈ స్పెషల్ స్ప్రేను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఒక గ్లాస్ వాటర్ ను తీసుకుని అందులో రెండు మూతల డెటాల్ ను వేయండి. అలాగే రెండు టీ స్పూన్ల ఇంగువ వేసి బాగా కలపండి. దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపండి. దీన్ని ఎప్పటికప్పుడు చీమలు వచ్చే చోట స్ప్రే చేయండి. దీంతో చీమలు లేకుండా పోతాయి. దీని ఘాటైన వాసన చీమలకు అస్సలు నచ్చదు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోతాయి.

34
దాల్చిన చెక్క పొడి

ప్రతి ఇంట్లో ఉండో మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చిన చెక్కతో కూడా ఇంట్లో నల్ల చీమలు, ఎర్ర చీమలు లేకుండా చేయొచ్చు ఎందుకంటే చీమలకు దాల్చిన చెక్క వాసన అస్సలు నచ్చదు. ఇందుకోసం మీరు పెద్దగా చేయాల్సిన పనేం లేదు. కేవలం దాల్చిన చెక్క పొడిని తీసుకుని చేతులతో చీమలు వచ్చే ప్రదేశాల్లో చల్లితే చాలు. చీమలు పారిపోతాయి.

44
నిమ్మకాయ

అవును నిమ్మకాయతో కూడా ఇంట్లో చీమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసాన్ని పిండండి. దీన్ని స్ప్రే బాటిల్ లో నింపండి. దీనితో రోజూ కిచెన్ స్లాబ్ పై, చీమలు వచ్చే మూలల్లో స్ప్రే చేయండి. దీనివల్ల మీ ఇంట్లోకి చీమలు రానేరావు.

Read more Photos on
click me!

Recommended Stories