Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?

Published : Jul 16, 2026, 10:05 AM IST

Jobs: అంబానీ ఇంట్లో కొన్ని వందల మంది రెగ్యులర్ గా పని చేస్తూ ఉంటారు.మీకు కూడా అంబానీ ఫ్యామిలీ లో పని కావాలా? అయితే.. ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా? ఎలాంటి క్వాలిటీలు చూసి ఉద్యోగం ఇస్తారో తెలుసా?

PREV
13
అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా?

మన దేశంలో అత్యంత ధనవంతులు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. వీరి కుటుంబం నివసించే ఆంటిలియా గురించి ఎప్పుడూ ఆసక్తికర వార్తలు వస్తూ ఉంటాయి.వారి ఇంట్లో చాలా మంది పని చేస్తూ ఉంటారు. అక్కడ పనిచేసే సిబ్బంది, వారి జీతాలు, సౌకర్యాల గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి.. అంబానీ ఇంట్లో పని చేసే ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? వారి ఇంట్లో ఉద్యోగం రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

23
అంబానీ ఇంట్లో వంటవాడి జీతం ఎంతంటే...

పలు మీడియా కథనాల ప్రకారం.. అంబానీ ఇంట్లో ఎంట్రీ లెవల్ చెఫ్ కి నెలకు సుమారు రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు జీతం ఇస్తారు. అదే కాస్త అనుభవం ఎక్కువ ఉన్న సీనియర్ లేదా ఎగ్జిక్యూటివ్ చెఫ్ లకు నెలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఇస్తారు.

ఆ ఇంట్లో చెఫ్ గా అడుగుపెట్టాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

అంబానీ ఇంట్లో మీరు చెఫ్ గా జాయిన్ అవ్వాలి అంటే. హోటల్ మేనేజ్మెంట్ లేదా క్యూలినరీ ఆర్ట్స్ లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ఏదైనా 5 స్టార్ హోటల్ లో పని చేసిన అనుభవం ఉండాలి. ఇండియన్ , ఇంటర్నేషనల్ వంటలపై అవగాహన ఉండాలి. అంతేకాదు.. పరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై అవగాహన ఉండాలి. అన్ని విషయాలను కాన్ఫిడెన్షియల్ గా కూడా ఉంచాలి.

33
ఇంటర్వ్యూ ఎలా సాగుతుంది?

అంబానీ ఇంట్లో చెఫ్ గా ఉద్యోగం రావాలి అంటే.. కేవలం వంట వస్తే సరిపోదు. ఇంటర్వ్యూ చాలా టఫ్ గా సాగుతుంది. ముఖ్యంగా వంట రుచిగా చేయాలి. దానిని మరింత అందంగా ప్రజెంటేషన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎంత ఒత్తిడిలో అయినా పని చేసే సామర్థ్యం మీకు ఉందో లేదో కూడా చూస్తారు. మీ ప్రవర్తన చూస్తారు. మీ బ్యాంక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఇవన్నీ ఒకే అయిన తర్వాతే మీకు ఉద్యోగం కన్ఫామ్ చేస్తారు.

ప్రతిరోజూ ఎలాంటి వంటలు చేయాలి..?

ముఖేష్ అంబానీకి సాధారణ భారతీయ ఆహారమే ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా గుజరాతీ వంటకాలు, దక్షిణ భారత వంటకాలు, ఆరోగ్యకరమైన ఆహారం, సీజనల్ కూరగాయలు వంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి.. రోజూ ఇలాంటి వంటకాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

అంబానీ ఇంట్లో పనిచేసేవారికి జీతంతో పాటు వచ్చే అదనపు ప్రయోజనాలు ఇవే..

అంబానీ ఇంట్లో పనిచేసేవారికి కేవలం జీతం మాత్రమే కాదు.. కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వారికి వైద్య సదుపాయాలు, ఇన్సూరెన్స్ లాంటివి కూడా లభించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories