గర్భిణుల్లో కొన్ని లక్షణాలను బట్టి పుట్టేది అబ్బాయో.. అమ్మాయో ఈజీగా తెలుసుకోవచ్చంట

First Published | Mar 18, 2022, 12:50 PM IST

గర్భిణులుగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ అమ్మాయా? లేక అబ్బాయా? అన్న విషయాలను తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అయితే మన అమ్మలు చెప్పిన కొన్ని విషయాలు పుట్టబోయే బిడ్డ జెండర్ ను తెలియజేస్తాయట. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

పెళ్లైన ప్రతి స్త్రీ మొదటి కోరిక.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశపడుతుంటుంది. ఇందుకోసం ఎన్నో మొక్కులు కూడా మొక్కుకుంటూ ఉంటారు. ఒక స్త్రీ గర్భిణి అనే వార్త వింటే ఆమె సంతోషానికి అవదులు ఉండవేమో కదా.. ఇంటిల్లి పాదీ ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆమెతో పాటుగా కడుపు లో మగ బిడ్డ ఉన్నాడో.. ఆడబిడ్డ ఉందో.. తెలిస్తే ఎంత బావుండో అంటూ కుతూహలంగా ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు.  
 

కడుపులో బిడ్డ అమ్మాయో, అబ్బాయో హాస్పటల్లకు వెళ్లి తెలుసుకోవడం చట్టవిరుద్దం కూడా .. పుట్టబోయే బిడ్డ ఎవరైనా సరే.. ఆ తల్లి ఎంతో అపురూపంగా పెంచుతుంది. అయితే మన అమ్మమ్మలు చెప్పిన కొన్ని విషయాలతో పుట్టబోయే బిడ్డ అమ్మాయో, అబ్బాయో మనమే కనిపెట్టొచ్చంట. అవేంటో సరదాగా తెలుసుకుందాం పందండి.. 
 


 గర్భం దాల్చిన మొదట్లో ఆ తల్లి ముఖం కాంతివంతంగా తయారైతే .. అబ్బాయి అని, అదే యాక్నే వచ్చి డల్ గా మారితే అమ్మాయి పుడుతుందని అంటుంటారు. 

 గర్భిణులుగా ఉన్న సమయంలో కొంతమందికి రకరకాల ఆహార పదార్థాలను టేస్ట్ చేయాలని ఆశపడుతూ ఉంటుంది. ఆ సమయంలో వారి మనస్సు తీపి పదార్థాల వైపు మళ్లితే అమ్మాయి అని, పుల్ల పదార్థాల వైపు మళ్లితే అబ్బాయి పుడతాడని పెద్దలు చెబుతూ ఉంటారు. 

బేబీ హార్ట్ రేట్ ను బట్టి కూడా వారు అబ్బాయో.. అమ్మాయో కనిపెట్టొచ్చంట. బేబీని చెకప్ చేసే సమయంలో  వారి హార్ట్ రేట్ ను గమనించండి. బేబీ హార్ట్ రేట్ నిమిషానికి 140 కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయని, అంతకన్నా తక్కువగా ఉంటే అబ్బాయని అంటుంటారు. 

pregnancy

 గర్భం దాల్చినప్పటి నుంచి కొందరికి మూడు నెలల వరకు వేవిళ్లు వస్తుంటాయి. అయితే కొందరికి ఈ వేవిళ్లు మూడు నెలల తర్వాత సామాన్యంగా రావు. అయితే ఈ వేవిళ్లు మూడు నెలల తర్వాత కూడా వస్తే మాత్రం అమ్మాయి పుడుతుందని అంటుంటారు. వేవిళ్లు ఎంతకాలమొచ్చినా.. బిడ్డను చూడగానే తన కష్టమంతా మర్చిపోతుంది. 

 అమ్మమ్మల సూచనల ప్రకారం.. గర్భిణుల పొట్ట ఎత్తుగా ఉంటే అమ్మాయి పుడుతుందని, పొట్ట చిన్నగా ఉంటే అబ్బాయి పుడతాడని అంటుంటారు. 

గర్భిణులు నెలలు నిండుతున్న కొద్దీ పడుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే గర్భిణులు కుడి వైపు తిరిగి పడుకుంటే అమ్మాయని, అదే ఎడమ వైపు తిరిగి పడుకుంటే వారి కడుపులో అబ్బాయి పెరుగుతున్నాడని నమ్ముతుంటారు.     

Latest Videos

click me!