Brain : బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే..?

Published : Mar 18, 2022, 11:07 AM IST

Brain : మెదడు ఆరోగ్యానికి పెరుగు వాల్ నట్స్, అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయి. 

PREV
112
Brain : బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే..?

మన  బాడీలోని ప్రతి పార్ట్ బ్రెయిన్ ఆదేశానుసారమే పనిచేస్తుంది. మెదడు ఆదేశించపోతే.. మనం ఏ పనీ చేయలేము. ఇక మన రోజువారి పనులు సక్రమంగా, పనులు చాలా త్వరగా పూర్తికావాలంటే మెదడు పనితనం బాగుండాలి. మన శరీరంతో పాటుగా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చురుగ్గా పనిచేయగలుగుతాం. 

212
brain

అయితే కొన్ని రకాల ఆహారాల వల్ల మెదడు మొద్దుబారుతూ ఉంటుంది. దాంతో మనం ఏ పని సక్రమంగా చేయలేము సరికదా.. బద్దకంగా ప్రవర్తిస్తుంటాం. అలా కాకూడదంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల మెమోరీ పవర్ పెరగడమే కాదు.. బ్రెయిన్ చాలా షార్ప్ గా కూడా అవుతుంది. దీంతో అనేక విషయాలను చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. 

312

అంతేకాదు మీ మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ఏ విషయాలను కూడా మర్చిపోరు. మరి ఇందుకు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో  ఓ లుక్కేయండి.. 

412

వాల్ నట్స్: వాల్ నట్స్ లో న్యూరాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు మెమోరీ పవర్ ను కూడా పెంచుతాయి. 
 

512

అరటి పండ్లు: అరటి పండులో మాంగనీస్ మెండుగా ఉంటుంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్స్ కు ఎంతో అవసరం. వీటిని ఎక్కువగా తినడం వల్ల మెదడు చాలా షార్ప్ గా పనిచేస్తుంది. కాబట్టి వీటిని తరచుగా తినండి. 
 

612

చాక్లెట్: మెదడుకు Blood flow సరిగ్గా జరిగినప్పుడే.. బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. బ్లడ్ ఫ్లో బాగుండటానికి డార్క్ చాక్లెట్ ఎంతో సహాయపడుతుంది. మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే తరచుగా డార్క్ చాక్లెట్ ను తినండి.
 

712

కాఫీ:  కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కెఫిన్ బ్రెయిన్ కు బూస్ట్ లా పనిచేస్తుంది. ఈ కెఫిన్ బ్రెయిన్ ను షార్ప్ చేస్తుంది. అలా అని కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. రోజుకు రెండు కప్పులకు మించి కాఫీని తీసుకోకూడదు. 

812

పెరుగు: పెరుగులో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది మెదడు పనితీరును మెరుపరుస్తుంది కూడా. 

912

చేపలు:  చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి బ్రెయిన్ షార్ప్ గా అయ్యేందుకు సహాయపడతాయి. వీటిని తరచుగా తింటే మీ బ్రెయిన్ కు శక్తి లభించి మెరుగ్గా పనిచేస్తుంది. 

1012

ఆకు కూరలు: ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు ఎంతో అవసరపడుతుంది. కాబట్టి ఆకుకూరలను ఎక్కువ మొత్తంలో తినండి. 

1112

పుదీనా: మెదడు చురుగ్గా పనిచేయడానికి, హెచ్చరించడానికి, మెదడు సరిగ్గా పనిచేయడానికి పుదీనా ఎంతో సహాయపడుతుంది. బ్రెయిన్ షార్ప్ గా అవ్వాలంటే Cup peppermint tea ని తాగుతూ ఉండండి. 

1212

స్ట్రాబెర్రీస్: వీటిలో Antioxidants మెండుగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగు పరిచే కాంపౌండ్స్ స్ట్రాబెర్రీలల్లో మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తింటూ ఉండండి. 

Read more Photos on
click me!

Recommended Stories