బఠానీలతో ఈ సమస్యలన్నీ పరార్..

Published : Mar 18, 2022, 11:56 AM IST

పచ్చి బఠానీల్లో ఉండే పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఎ, సి ఒమేగా 3 ఫ్యాటీ  ఆమ్లాలు.. ఇతర పోషకాలు షుగర్ లెవెల్స్ ను తగ్గించడంతో పాటుగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు గుండె ఆరోగ్యానికి, మలబద్దకం, స్టమక్ క్యాన్సర్ నివారణకు ఎంతో సహాయపడుతుంది.

PREV
111
బఠానీలతో ఈ సమస్యలన్నీ పరార్..

చిన్నగా ఉండే బఠానీల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటినాయిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యను నివారిస్తాయి. 
 

211


ఇందులో ఉండే యాంటీ ఆన్ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. అంతేకాదు ఇవి వృద్దాప్యం తొందరగా రాకుండా చూస్తాయి. మరి పచ్చి బఠానీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. తెలుసుకుందాం పదండి.. 

311

వెయిట్ లాస్: పచ్చి బఠానీల్లో ఫ్యాట్ , కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, పోషక విలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పచ్చి బఠానీలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. 

411

మలబద్దకం: పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు  ఇది జీర్ణక్రియను మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో సహాయపడుతుంది. 
 

511

ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది: గుండె సంబంధిత రోగాలు, ఆర్థరైటిస్, Osteoporosis, వంటి రోగాలు రాకుండా ఉండేందుకు Inflammation ను తగ్గించడానికి పచ్చి బఠానీలు సహాయపడుతాయి. 
 

611

షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది : పచ్చి బఠానీల్లో Antioxidants, Anti-inflammatory గుణాలు ఉంటాయి. ఇవి Insulin resistance ను తగ్గిస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, నేచురల్ షుగర్ లెవెల్స్ డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో అవసరం. 
 

711

వ్యాధి నిరోధకతను పెంచుతుంది: పచ్చి బఠానీల్లో ఉండే ఫోలిఫినాయిల్స్, ఫ్లెవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ , కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. 

811

గుండె ఆరోగ్యానికి: పచ్చి బఠానీలు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. వీటిలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. 

911

ఎముకల ఆరోగ్యానికి: వీటిలో ఉండే విటమిన్ బి, కె ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు ఇవి ఓస్టియోపోరోసిస్  ను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

1011

పచ్చి బఠాణీలు గర్భిణులకు ఎంతో అవసరం. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల బిడ్డకు పోషకాహార లోపం ఏర్పడే ఛాన్స్ యే ఉండదు. 

1111

పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కాంతివంతంగా తయారయ్యేందు, స్కిన్ ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. 

click me!

Recommended Stories