అవిసె గింజల పైన ఉండే పొర చాలా గట్టిగా ఉంటుంది. అందుకే వీటిని నేరుగా నమలకుండా మింగేస్తే, జీర్ణం కాకుండా శరీరం నుండి అలాగే బయటకు వచ్చేస్తాయి. అందుకే వీటిని.. ఎలా తినాలంటే...
పొడి రూపంలో : అవిసె గింజలను దోరగా వేయించి, మిక్సీలో పొడి చేసుకుని గాజు సీసాలో పెట్టుకోండి. ఈ పొడిని రోజూ మనం తినే పెరుగు, ఓట్స్, స్మూతీస్, పప్పు లేదా చపాతీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ కలుపుకుని తింటే సరిపోతుంది.
నానబెట్టిన నీళ్లతో: రాత్రి వేళ ఒక స్పూన్ అవిసె గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి, గింజలను బాగా నమిలి తినవచ్చు.
మొలకలు : వీటిని నానబెట్టి మొలకెత్తించడం వల్ల వీటిలోని ప్రోటీన్, ఒమేగా-3 గుణాలు రెట్టింపు అవుతాయి.
రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ అంటే..10-15 గ్రాములు అవిసె గింజలు తినడం ఆరోగ్యానికి సరిపోతుంది. అతిగా తింటే కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.