Beauty Tips: చేతులు అందవికారంగా ఉన్నాయా.. అయితే ఫ్రెంచ్ మానిక్యూర్ ట్రై చేయాల్సిందే!

Navya G | Published : Sep 14, 2023 11:04 AM
Google News Follow Us

Beauty Tips: ఒక మనిషికి పరిపూర్ణమైన అందం రావాలంటే ముఖము, జుత్తు అందంగా ఉంటే సరిపోదు. కాళ్లు, చేతులు కూడా అందంగా ఉంటేనే మనం అందంలో పరిపూర్ణతని సాధిస్తాం. అయితే అందమైన చేతుల కోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
 

16
Beauty Tips: చేతులు అందవికారంగా ఉన్నాయా.. అయితే ఫ్రెంచ్ మానిక్యూర్ ట్రై చేయాల్సిందే!

 మహిళల అందం మీద ఒక సర్వేని నిర్వహిస్తే అందులో చాలామంది స్త్రీలు ముఖానికి జుట్టుకి ఎక్కువగా శ్రద్ధ చూపించి, చేతులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ పరిపూర్ణమైన అందం కోసం కాళ్లు చేతులు కూడా అందంగా ఉండాలి. అందుకే చేతులు అందంగా కనిపించడం కోసం ఫ్రెంచ్ మానిక్యూర్ చేయించుకోవడం చాలా అవసరం.
 

26

అయితే ఇవి పార్లర్లో చేయించుకోవాలంటే  చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఇంట్లోనే ఈ ఫ్రెంచ్ మానిక్యూర్  ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ఫ్రెంచ్ మానిక్యూర్  పద్ధతిలో గోరు చివరి పై తెల్లని నెయిల్ పెయింట్ వేస్తారు. గోరు కింద లేత రంగులో పూత పూయబడతాయి. ఇలా చేయటానికి ఎంతో నైపుణ్యత కావాలి.
 

36

కానీ సరి అయిన పరిజ్ఞానం ఉంటే మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిందల్లా ఒక నెయిల్ పెయింట్ మాత్రమే. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని గోరువెచ్చగా చేయండి. తర్వాత స్టవ్ ని ఆపివేసి మీ చేతిలని కాసేపు అందులో నానబెట్టండి.

Related Articles

46

ఇలా చేయటం వలన పొడి చర్మం మరియు ధూళి శుభ్రపడతాయి. ఇప్పుడు మీ చేతిలో ఫ్రెంచ్ మానిక్యూర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చేతులు ఆరిన  తర్వాత గోళ్ళపై బేస్ కోట్ నెయిల్ పెయింట్ వేయండి.

56

 ఇది మీ గోళ్ల కి మెరుపుని తీసుకువస్తుంది. ఈ బేస్ కోట్ ఆరిన తరువాత గోర్ల చివరలపై  తెల్లని నెయిల్ పెయింట్ వేయండి. ఇలా వేసే ముందు ఒక టేప్ ని తీసుకొని సన్నగా కత్తిరించండి. తర్వాత గోర్ల కి రెండువైపులా అప్లై చేయండి. ఇది మీ గోరు కి అందమైన ఆకృతిని ఇస్తుంది.

66

 ఇప్పుడు టాప్ నెయిల్ పై పెయింట్  అప్లై చేయండి. ఇటువంటి వాటికి లైట్ కలర్స్ నెయిల్ పెయింట్స్ బాగా సూట్ అవుతాయి. ఆ తర్వాత గోళ్ళ పై కలర్ లెస్ నెయిల్ పెయింట్ వేయండి. ఇది మీ గోళ్ళని షైనింగ్ చేస్తుంది. అలాగే మీ వేళ్ళు సన్నగా కనిపించేలాగా చేస్తుంది.

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos