ప్రతి గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. గురువారం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజు విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు దేవగురువు బృహస్పతిని కూడా పూజిస్తారు. గురువారం నాడు శ్రీవిష్ణువును పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు వృత్తి, వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలను పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. గురువారం నాడు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..