మీ కష్టాలు పోవాలంటే.. వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి..

First Published | Sep 14, 2023, 10:17 AM IST

Ganesh Chaturthi 2023: వినాయక చవితి పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. విఘ్నేషుడి జననాన్ని గుర్తు చేసే ఈ పండుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పది రోజుల పాటు గణేషుడిని పూజిస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం. అయితే..

Ganesh Chaturthi 2023: విఘ్నేషుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చతుర్థి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. కరుణామయుడైన స్వామిని విఘ్నహర్తుడు అని కూడా అంటారు. ఈ దేవుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, సంపదలు పెరుగుతాయని నమ్మకం.  ఈ హిందూ పండుగ ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని చతుర్థి నాడు ప్రారంభమవుతుంది. ఈ పండుగను 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక చవితి సమీపిస్తుండటంతో చాలా మంది ఇప్పటి నుంచే వినాయకుడి విగ్రహాలను కొంటుంటారు. అయితే వినాయక విగ్రహాలను కొనే ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. 

గణపతి స్వరూపం

వినాయకుడి విగ్రహాన్ని కొనేముందు ఈ దేవుడి భంగిమను పరిశీలించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే మీరు కొనే విఘ్నేషుడి భంగిమ లలితాసనంలో ఉండేలా చూసుకోవాలి. ఈ భంగిమలోని విగ్రహం ఆదర్శ వినాయకుడిగా పరిగణించబడుతుంది. ఈ విగ్రహం ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ భంగిమలో ఉన్న విఘ్నేహుడిని కూర్చున్న వినాయకుడు అని కూడా పిలుస్తారు. ఇలాంటి భంగిమలో ఉన్న గణపతి విగ్రహాలు సౌకర్యానికి, విలాసానికి, సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. 
 


వినాయకుడి తొండం

మీ ఇంట్లోకి వినాయకుడికి విగ్రహాని కొనేటప్పుడు విఘ్నేషుడి తొండం ఏ స్థానంలో ఉందో గమనించడం కూడా చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం.. వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉండాలి. ఎందుకంటే ఇది శ్రేయస్సు, అదృష్టాన్ని సూచిస్తుంది. 
 

గణపతి విగ్రహం రంగు

శాంతిని, సంపదను, శ్రేయస్సును కోరుకునే కుటుంబాలకు.. వాస్తు ప్రకారం.. తెలుసు రంగు వినాయకుడి విగ్రహాలు మంచివి. వృత్తిపరంగా ఎదగాలనుకునేవారు కుంకుమ రంగులో ఉండే వినాయక విగ్రహాన్ని కొనాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. తెల్ల రంగులో ఉన్న వినాయకుడు సంపదకు, ఆనందానికి, విజయనికి ప్రతీక. దేవుడి ముఖం ఎప్పుడూ ఇంటికి గుమ్మనికి ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి.
 

వినాయకుడి విగ్రహం విరగకూడదు

విరిగిన వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకురావడం అశుభం. అందుకే మీరు కొనే వినాయక విగ్రహం అంతా బానే ఉందో లేదో బాగా పరిశీలించి కనండి. ఆ తర్వాతే ఇంటికి తీసుకురండి. 
 

వినాయకుడి విగ్రహం ఏర్పాటు

విఘ్నేషుడి తండ్రి అయిన మహాశివుడు ఉత్తర దిశలో నివసిస్తాడని నమ్ముతారు. అందుకే ఇంట్లో వినాయకుడి విగ్రహాలను పశ్చిమ, ఉత్తర, ఈశాన్య దిశల్లో పెట్టొచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు. 
 

Latest Videos

click me!