Plastic Chair Cleaning: దాదాపు అందరు ఇళ్లల్లో ప్లాస్టిక్ కుర్చీలు ఒకటో రెండో ఉంటాయి. చాలా కాలంగా వాడటం వల్ల అవి నల్లగా మారిపోతాయి.కానీ..వాటిని చాలా సింపుల్ గా కొత్త వాటిలా మార్చేయచ్చు.
ఇంట్లో వాడే ప్లాస్టిక్ కుర్చీలు కాలక్రమేణా మెరుపు కోల్పోతాయి. నల్లగా మారతాయి. రెగ్యులర్ గా శుభ్రం చేస్తున్నా కూడా ఆ పేరుకుపోయిన మురికి వదలదు. కొంతకాలం అలానే వదిలేసి.. ఆ తర్వాత..వాటిని పడేసి.. మళ్లీ కొత్త వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాం.కానీ.. సింపుల్ గా కొన్ని వస్తువులతో వాటిని శుభ్రం చేస్తే.. మీ ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీని మళ్లీ కొత్త దానిలా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
23
బేకింగ్ సోడా..
కుర్చీలపై జిడ్డు లేదా మొండి మరకలు ఉంటే, బేకింగ్ సోడా వాడితే సరిపోతుంది. ముందుగా, బేకింగ్ సోడాను నీటితో కలిపి చిక్కటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని.. కుర్చీ మొత్తానికి అప్లై చేసి.. 10 నుంచి 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే.. జిడ్డు, మొండి మరకలన్నీ సులభంగా వదులుతాయి. తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. కుర్చీ కొత్తదానిలా కనిపిస్తుంది.
వెనిగర్..
మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటే.. దానితో కూడా మీ పాత కుర్చీని కొత్త దానిలా మార్చేయవచ్చు. దీని కోసం.. మీరు వెనిగర్ ని.. నార్మల్ వాటర్ తో కలిపి ఒక మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కుర్చీ మొత్తం చల్లాలి. కొన్ని నిమిషాల తర్వాత.. పొడి క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. మురికి మొత్తం వదులుతుంది. ఇలా వారానికి రెండు, మూడుసార్లు శుభ్రం చేస్తే.. కుర్చీ కొత్తగా కనపడుతుంది.
33
గోరువెచ్చని నీరు, సబ్బు...
ప్రతిరోజూ శుభ్రం చేయాలి అనుకుంటే.. సబ్బు, గోరు వెచ్చని నీరు సరిపోతాయి. ఈ రెండింటినీ నీటిలో బాగా కలిపి మృదువైన క్లాత్ తో తుడవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, తేలికపాటి మరకలు సులభంగా వదులుతాయి. కుర్చీలు చాలా కాలంపాటు కొత్త వాటిలా కనపడతాయి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
ప్లాస్టిక్ కుర్చీలను శుభ్రపరిచేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్లు లేదా కఠినమైన రసాయనాలను ఉపయోగించవద్దు. దీనివల్ల ఉపరితలంపై గీతలు పడి, రంగు మారవచ్చు. ఎల్లప్పుడూ మృదువైన స్క్రబ్బర్‌ను ఉపయోగించండి.