వైట్ టైల్స్ ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published | Jun 16, 2024, 4:32 PM IST

వైట్ టైల్స్  ఫ్లోరింగ్ పై ఏ మరకలు పడ్డా అవి అంత ఈజీగా పోవు. వీటిని శుభ్రం చేసి చేసి ఆడవాళ్ల చేతులే నొప్పి పెడుతుంటాయి. కానీ కొన్ని చిట్కాలతో వైట్ టైల్స్ ను చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే? 

 టైల్స్ ఇంటికే అందాన్ని తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన రకం టైల్స్ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ వీటిని మెయింటెనెన్స్ చేయాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. టైల్స్ ఎప్పుడూ శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండటానికి చాలా టైల్స్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి. అయితే వైట్ టైల్స్ ఇతర ఫ్లోరింగ్ కంటే ఎక్కువ మురికిగా కనిపిస్తాయి. మొండి మరకలు టైల్స్ కు అంటితే పోగొట్టడం చాలా కష్టం. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం చాలా ఈజీగా వైట్ టైల్స్ ను శుభ్రంగా చేయొచ్చు. అదెలాగంటే? 

గోరువెచ్చని నీటితో శుభ్రం 

గోరువెచ్చని నీళ్లు టైల్స్ పై ఉన్న మొండి మరకలను శుభ్రం చేయడానికి బాగా సహాయపడతాయి. వైట్ టైల్స్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మురికి ఇట్టే తొలగిపోతుంది. గోరువెచ్చని నీటితో మోప్ చేసిన తర్వాత స్లైడ్ చేయండి. నేలను కుడి నుంచి ఎడమకు బాగా తుడవండి. ఫ్లోర్ పై మరకలు పూర్తిగా పోయే వరకు ఇలాగే చేయండి. అప్పుడే పడ్డ మరకలను తొలగించడానికి ఈ పద్దతి బాగా పనిచేస్తుంది. మొండి మరకలను పోగొట్టడానికి మీరు ఇల్లు తుడవడానికి ఉపయోగించే ద్రావణంతో ఇంటిని క్లీన్ చేయండి. 


కాఫీ,  జ్యూస్ మరకలు పోవడానికి 

టైల్స్ ఫ్లోరింగ్ పై కాఫీ, రసం మరకలను పోగొట్టడం చాలా కష్టం. అయితే వీటిని పూర్తిగా పోగొట్టడానికి మీ స్క్రబ్బింగ్ పనిని ఈజీ చేయడానికి ఈ ట్రిక్ బాగా సహాయపడుతుంది. ఇందుకోసం 1 1/2 కప్పుల తేలికపాటి డిటర్జెంట్ ను ఒక భాగం నీటితో కలిపి శుభ్రపరిచే ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణంతో మోప్ ను ముంచండి. దీన్ని మరకలు ఉన్న చోట శుభ్రం చేయండి. మరక మాయమయ్యే వరకు స్క్రబ్ చేస్తూనే ఉండండి. 
 

హైడ్రోజన్ పెరాక్సైడ్ 

డిటర్జెంట్, వెచ్చని నీటి ద్రావణాన్ని ఉపయోగించిన తర్వాత కూడా కఠినమైన మరకలు పోకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వాడండి. ఇది శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్. ఇది టైల్ ఫ్లోరింగ్ వంటి కఠినమైన ఉపరితలాలపై మొండి మరకలను సమర్థవంతంగా పోగొట్టగలదు. ఇందుకోసం శుభ్రమైన మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో టైల్స్ పై అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగండి. మొండి మరకలను తొలగించడంలో ఈ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది.
 

Latest Videos

click me!