ఫ్రిజ్ గోడకు ఆనుకుని ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 16, 2024, 3:03 PM IST

మనలో చాలా మంది ఫ్రిజ్ ను గోడకు ఆనించి పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ కు, గోడకు మధ్య కొంత గ్యాప్ ఉండాలంటారు నిపుణులు. ఒకవేళ మీరు ఫ్రిజ్ ను గోడకు ఆనించి పెడితే ఏమౌతుందో తెలుసా?
 

ఎండాకాలంలో ఫ్రిజ్, ఏసీ, కూలర్లు, ఫ్యాన్ లు గ్యాప్ లేకుండా నడుస్తూనే ఉంటాయి. చలికాలం రాగానే ఏసీ, కూలర్ల వాడకాన్ని తగ్గించినా.. ఫ్రిజ్ ను మాత్రం కాలాలతో సంబంధం లేకుండా వాడుతుంటారు. అయితే ఎండాకాలం ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలన్నీ వేగంగా వేడెక్కుతాయి. ముఖ్యంగా వేసవిలో ఫ్రిజ్ లోని కంప్రెసర్ చాలా ఫాస్ట్ గా వేడెక్కుతుంది. ఇది ఫ్రిజ్ చల్లదనాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండాకాంలో  ఫ్రిజ్ కంప్రెషర్ పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది ఫ్రిజ్ ను గోడకు ఆనించే పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఫ్రిజ్ కు, గోడకు మధ్య స్థలం చాలా ముఖ్యం. ఫ్రిజ్ ను గోడకు దగ్గరగా ఉంచితే దాని కంప్రెషర్ కు తగినంత గాలి అందదు. దీనివల్ల కంప్రెషర్ తొందరగా వేడెక్కుతుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు ఫ్రిజ్ మోటారు నుంచి కూడా మంటలు వస్తాయి.


fridge

మీకు పాత మోడల్ ఫ్రిజ్ ఉంటే దానిలో అమ్మోనియా వాయువు ఉండే అవకాశం ఉంది. ఈ వాయువులు మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మోడల్ ఫ్రిజ్ లో గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఫ్రిజ్ లను గోడకు దగ్గరగా ఉంచకూడదు.

కొంతమంది ఇంట్లో స్థలాన్ని ఆదా చేయడానికని ఫ్రిజ్ ను గోడకు దగ్గరగా పెడతారు. కానీ ఈ తప్పును అస్సలు చేయకూడదు. నిపుణుల ప్రకారం.. రిఫ్రిజిరేటర్ కు, గోడకు మధ్య 4 నుంచి 6 అంగుళాల గ్యాప్ ఉండాలి.

అన్ని కంప్రెసర్లు శబ్దం చేసినప్పటికీ, మీ కంప్రెసర్ ఎక్కువ శబ్దం చేసినా లేదా ఎలాంటి శబ్దం చేయకపోయినా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిజ్ లోపలి భాగం లాగే బయటి భాగాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉన్న కాయిల్స్, వెంట్ లపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీది పాత ఫ్రిజ్ అయితే కనీసం ఏడాదికి ఒకసారైనా చెక్ చేసుకోవాలి. ఫ్రిజ్ చల్లగా లేదని అనిపిస్తే వెంటనే టెక్నీషియన్ కు ఫోన్ చేసి ఫ్రిజ్ ను చెక్ చేయించాలి. 

Latest Videos

click me!