ఇంట్లో మసాలా మొక్కలను ఎలా పెంచాలి?

First Published | Jun 16, 2024, 2:35 PM IST

ఇతర దేశాలకంటే మన ఇండియన్సే మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం చేసే ప్రతి వంటలో మసాలా ఘాటు రావాల్సిందే. సాధారణంగా మాసాలా దినుసులను మనం మార్కెట్ లో కొంటుంటాం. కానీ కొన్ని మసాలా దినుసులను మీరు చాలా ఈజీగా ఇంట్లోనే పండించొచ్చు. అదెలాగంటే? 

ఇండియన్ ఫుడ్ లో మసాలా ఘుమఘుమలు చాలా ప్రత్యేకం. ఈ మసాలా దినుసులే మన ఫుడ్ ను మరింత రుచికరంగా చేస్తాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటారు. కానీ కొన్ని రకాల మసాలా దినుసుల్ని మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే పెంచొచ్చు. గార్డెనింగ్ ఇష్టపడే వ్యక్తులు మీ కిచెన్ గార్డెన్ లో మసాలా దినుసులను పండించొచ్చు. మరి ఇంట్లో మసాలా దినుసులను ఎలా పెంచొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇంట్లో అల్లం మొక్కను ఎలా పెంచాలి? 

కిచెన్ గార్డెన్ లో చాలా ఈజీగా పెంచే మసాలా దినుసుల మొక్కల్లో అల్లం మొక్క ఒకటి. అల్లం పెరగడానికి కొద్దిగా వెచ్చని వాతావరణం ఉండాలి. ఇందుకోసం వేర్లున్న చిన్న అల్లం ముక్కను తీసుకుని  పెద్ద పాత్రలో మట్టిపోసి నాటండి. పెద్ద పాత్రే ఎందుకంటే ఈ మొక్క ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ కంటైనర్ ఎండ బాగా తలిగే పరోక్ష సూర్యకాంతిని పొందే చోట ఉంచండి. అవసరాన్ని బట్టి నీటిన పోస్తుండండి. 
 

Latest Videos


ఇంట్లో పసుపు మొక్కను ఎలా పెంచాలి? 

పసుపు మన రోజువారి కూరల్లో ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. ఈ మొక్కను మీ ఇంటి గార్డెన్ లో పెంచాలనుకుంటే పసుపు వేర్లు అవసరం. అలాగే వీటిని ఒక కంటైనర్ లో నాటండి. ఈ కంటైనర్ ను ఎండకు ఒక 5 నుంచి 6 గంటలు ఉంచి తర్వాత నీడలో పెట్టండి. 

ఇంట్లో జీలకర్ర మొక్కను ఎలా పెంచాలి?

జీలకర్రను కూడా మనం చాలా కూరల్లో వాడుతుంటాం. మీకు తెలుసా? జీలకర్రను ఇంట్లో కిచెన్ గార్డెన్ లో చాలా ఈజీగా పండించొచ్చు. దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇందుకోసం మీరేం చేయాలంటే మట్టిపోసిన ఒక చిన్న పాత్రలో జీలకర్రను వేసి తగినంత నీరు పోయండి. అయితే జీలకర్ర మొక్కలు బాగా రావాలంటే మాత్రం మీరు సరైన జీలకర్రను ఎంచుకోవాలి.

ఇంట్లో కొత్తిమీర మొక్కను ఎలా పెంచాలి?

కొత్తిమీర మొక్కలను ఇంట్లో పెంచడం చాలా సులభం. ఈ కొత్తిమీరను పండించడానికి మీకు ధనియాలు అవసరం. ఎండిన ధనియాలను రెండుగా చేసి రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత రోజు విత్తనాలను నేరుగా భూమిలో వేయండి. విత్తనాలు కనిపించకుండా కొంచెం మట్టి వేయండి. అయితే ఈ మట్టి తేమగా ఉండాలి. అలాగే ధనియాలను వెడల్పాటి కంటైనర్ లో నాటాలి. 
 

ఇంట్లో పుదీనా మొక్కను ఎలా పెంచాలి?

రీఫ్రెషింగ్ మూలికల్లో పుదీనా ఒకటి. దీనిలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి.  కిచెన్ గార్డెన్ లో ఈ పుదీనా మొక్కను కూడా చాలా సులువుగా పెంచొచ్చు. ఈ మొక్కను పెంచడానికి  పుదీనా కాండం అవసరం. దీన్ని మట్టిలో నాటండి. పుదీనా మొక్క వికసించడానికి తగినంత తేమ, సూర్యరశ్మి ఉండాలి. 

click me!