వాటర్ ట్యాప్ ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

First Published | Jun 19, 2024, 4:26 PM IST

కిచెన్, బాత్రూం లో వాటర్ ట్యాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వంటగదిని, బాత్రూం ను క్లీన్ చేసినా.. ఎప్పుడూ వాడే వాటర్ ట్యాప్ ను మాత్రం శుభ్రం చేయరు. దీనివల్లే ట్యాప్ మురికిగా కనిపిస్తుంది. 
 

బాత్ రూంలో ఉండే  వాటర్ ట్యాప్ లకు సబ్బు, టూత్ పేస్ట్ మరకలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీటిని మాత్రం ఎవ్వరూ గమనించరు. బ్రష్ చేస్తున్నప్పుడు టూత్ పేస్ట్ మరకలు, ముఖం కడిగేటప్పుడు సబ్బు నురగ, చేతులు కడిగేటప్పుడు హ్యాండ్ వాష్ నీళ్లు ఖచ్చితంగా ట్యాప్ పై పడుతుంటాయి. వీటిని అలాగే క్లీన్ చేయకపోతే వాటిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీంతో వాటర్ ట్యాప్ లు మురికిగా మారుతాయి. ఈ మురికి అంత సులువుగా వదిలిపోదు. అందుకే ఈ వాటర్ ట్యాప్ లను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వెనిగర్ తో వాటర్ ట్యాప్ క్లీన్ 

వెనిగర్ ను ఉపయోగించి కూడా మీరు నీటి కుళాయిని శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో  సమానంగా వైట్ వెనిగర్, నీటిని కలపండి.  ఈ ద్రావణంలో శుభ్రమైన క్లాత్ లేదా స్పాంజ్న ను ముంచండి. ఈ స్పాంజ్ కు నీళ్లు ఎక్కువగా లేకుండా చేసి వాటార్ ట్యాప్ ఉపరితలాన్ని మొత్తం తుడవండి. అలాగే దుమ్ము, ధూళి లేదా నీటి మరకలు పేరుకుపోయిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. 


Vinegar

ఈ వెనిగర్ ద్రావణాన్ని కుళాయి ఉపరితలంపై కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఇది మొండి మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. మొండి మరకలు పోవడానికి వెనిగర్ లో నానబెట్టిన  క్లాత్ లేదా పాత టూత్ బ్రష్ ఉపయోగించి కుళాయి మూలల్లో బాగా తుడవండి. ఆ తర్వాత ట్యాప్ ను క్లీన్ వాటర్ తో బాగా కడగండి. 
 

నిమ్మరసంతో వాటర్ ట్యాప్ ను ఎలా శుభ్రం చేయాలి? 

నిమ్మకాయలు ఉంటే నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. లేదా బాటిల్ నిమ్మరసాన్ని తీసుకోండి. దీంట్లో శుభ్రమైన క్లాత్ లేదా స్పాంజ్ ను ముంచండి. దీన్ని పిండండి. దీనితో నీటి కుళాయి మొత్తం ఉపరితలాన్ని తుడవండి. అయితే నిమ్మరసాన్ని కుళాయి ఉపరితలంపై కొన్ని నిమిషాల పాటు తుడవకుండా ఉండండి. ఎందుకంటే నిమ్మకాయలోని సహజ ఆమ్లత్వం ఖనిజ నిక్షేపాలు, మొండి మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. నిమ్మరసం మరకలను పోగొట్టడానికి మంచినీటితో ట్యాప్ ను కడిగి పొడి గుడ్డతో తుడవండి.
 

టూత్ పేస్ట్ తో వాటర్ ట్యాప్ ను ఎలా శుభ్రం చేయాలి? 

ఒక తడి గుడ్డను తీసుకుని దానిపై కొద్దిగా టూత్ పేస్ట్ ను పెట్టండి. ఈ టూత్ పేస్ట్ ను కుళాయి ఉపరితలంపై సున్నితంగా అప్లై చేయండి. టూత్ పేస్ట్ కుళాయిపై ఉన్న మరకలను, దుమ్మును, ధూళిని చాలా సులువుగా పోగొడుతుంది. ఆ తర్వాత టూత్ పేస్ట్ ట్యాప్ పై లేకుండా నీటితో బాగా కడగండి. ఆ తర్వాత పొడి క్లాత్ తో వాటర్ ట్యాప్ ను నీట్ గా తుడవండి.

Latest Videos

click me!