ఇంట్లో గోడలకు మరకలు ఉన్నాయా..? ఇలా క్లీన్ చేయండి..!

First Published | Jun 19, 2024, 4:05 PM IST

ఇంట్లో పిల్లలు ఉంటే... పెన్సిల్స్, పెన్నులు, క్రేయాన్స్ తో.. గోడల మీద గీసేస్తూ ఉంటారు. ఇక.. వాటిని తొలగించడం తమ వల్ల కాక.. పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు.

దాదాపు అందరి ఇంట్లో గోడలు తెల్లగానే ఉంటాయి. లేదు.. అని ఎవరైనా పెయింటింగ్స్  వేయించుకున్నా కూడా  రాయల్ గా కనిపించాలి అని.. లైట్ కలర్స్ వేయించుకుంటూ ఉంటారు. గోడలకు లైట్ కలర్స్ ఉండటం వల్ల  తొందరగా మరకలు పడుతూ ఉంటాయి. ఇక.. ఇంట్లో పిల్లలు ఉంటే... పెన్సిల్స్, పెన్నులు, క్రేయాన్స్ తో.. గోడల మీద గీసేస్తూ ఉంటారు. ఇక.. వాటిని తొలగించడం తమ వల్ల కాక.. పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు.

గోడల మీద పడిన మరకలను తొలగించడానికి.. కొందరు మళ్లీ పెయింట్సింగ్ చేయించుకుంటూ ఉంటారు. కానీ.. ఆ సమస్య లేకుండా... మనం సింపుల్ చిట్కాలను ఉపయోగించి.. ఆ మరకలను ఈజీగా రిమూవ్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

Latest Videos


మనం ఇంట్లో చాలా రకాల వస్తువులను క్లీన్ చేయడానికి వెనిగర్ ని వాడుతూ ఉంటాం. అదే వెనిగర్ ని ఉపయోగించి.. మనం గోడల మీద మరకులను తొలగించవచ్చు.  దీని కోసం, మీరు వెనిగర్లో నీటిని కలిపి ఒక ద్రావణాన్ని సిద్ధం చేయాలి.ఇప్పుడు, మురికి గోడపై అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి.
తరువాత, మెత్తని గుడ్డతో గోడను స్క్రబ్ చేసి తుడవండి. దీని తరువాత మీరు నీటితో గోడను కడగవచ్చు. ఎలాంటి మొండి మరకలు అయినా.. ఈజీగా వాటిని  తొలగించవచ్చు.

2.బేకింగ్ సోడా...
గోడపై మరకలను తొలగించడానికి మీరు బేకింగ్ సోడాలను కూడా వాడొచ్చు.  బేకింగ్ సోడాలో నీరు కలిపి మంచి పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత.. ఆ పేస్టును గోడకు అప్లై చేసి... కనీసం 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.  తర్వాత... దానిని బ్రష్ తో రుద్దాలి.  తర్వాత.. నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.


3.నిమ్మకాయ..
ఇంట్లో నిమ్మకాయ ఉంటే.. దానితో కూడా మరకలను తొలగించవచ్చు. దీని కోసం ముందుగా.. నిమ్మకాయలను రెండు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక సగం ముక్క నిమ్మకాయను తీసుకొని... ఆ మరకలపై నెమ్మదిగా రుద్దాలి. రుద్దిన తర్వాత పది నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత.. నీటితో  శుభ్రం చేయాలి.
 

4.బియ్యం నీరు..

బియ్యం నీటితో గోడలను శుభ్రం చేయవచ్చు. బియ్యాన్ని కడిగిన తర్వాత అందులో మిగిలే నీటిని సేకరించాలి.
స్ప్రే బాటిల్‌లో నింపి గోడపై స్ప్రే చేయాలి. తర్వాత మెత్తని గుడ్డతో గోడను తుడిచి నీటితో కడగాలి.
 

tooth paste


5.టూత్ పేస్ట్..
టూత్‌పేస్ట్ ప్రభావవంతంగా పని చేస్తుంది.  తెల్లటి టూత్‌పేస్ట్‌ను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి.ఇప్పుడు ఆ పేస్ట్‌ని గోడ మరకలపై అప్లై చేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత తడి గుడ్డతో గోడను తుడవండి. ఆ తర్వాత నీటితో క్లీన్ చేస్తే సరిపోతుంది. 

click me!