వెల్లుల్లి తొక్క తీయడం ఎలా?
ఉదయాన్నే హడావుడిగా వంట చేసి పనులకు వెళ్లే ఆడవాళ్లకు వెల్లుల్లి తొక్క తీయడం చాలా కష్టమైన పనే. వెల్లుల్లి తొక్కను తీయడం వల్ల చాలా మందికి బొటనవేలి, చూపుడు వేళి గోరు బాగా నొప్పి పెడుతుంటుంది. అందుకే ఇలా కాకూడదని కత్తిని ఉపయోగిస్తుంటారు. కానీ వెల్లుల్లి తొక్కను ఇలా తీస్తే చాలా టైం పడుతుంది. అయితే వెల్లుల్లి రెబ్బలను సిల్వర్ బాక్స్ లో వేసి మూతపెట్టి ఒక నిమిషం పాటు బాగా ఊపాలి. దీన్ని ఓపెన్ చేస్తే మీరు వెసిన వెల్లుల్లి రెబ్బల తొక్కలు చాలా వరకు ఊడిపోయి ఉంటాయి. మిగిలిన తొక్కలను మీరు చాలా ఈజీగా, ఫాస్ట్ గా తీయొచ్చు.