కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

First Published Jun 23, 2024, 3:07 PM IST

కొన్ని కొన్ని సార్లు కూరల్లో కారమో, ఉప్పో ఎక్కువ అవుతుంటుంది. ఇది చాలా కామన్. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వంటలను అస్సలు తినలేం. ఇలాంటి వంటలు డస్ట్ బిన్ పాలే అవుతుంటాయి. కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించొచ్చు. అదెలాగంటే?
 

Image: Getty

కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాం. కూరలో కారమెక్కువైనా ఎలాగోలా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నోట్లో అస్సలు పెట్టలేం. ఇలాంటి కూరలను డైరెక్ట్ గా డస్ట్ బిన్ లోనే వేసేస్తుంటాం. కానీ మీరు కొన్ని చిట్కాలతో కూరలో ఎక్కువైన ఉప్పును చిటికెలో తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

టమాటాలు

కూరలో ఉప్పు ఎక్కువైతే టెన్షన్ పడకుండా అందులో కొన్ని తరిగిన టమాటాలో లేక టమాటా రసమో వేసి కలపండి. టమాటాల్లో ఉండే నేచురల్ ఎసిడిటీ ఉప్పును బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఈ సారి మీరు చేసిన కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని టమాటా ముక్కలు వేయండి.

పెరుగు

పెరుగును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ పెరుగును ఉపయోగించి మీరు కూరలో ఉప్పును తగ్గించొచ్చు. కూరలో ఉప్పు ఎక్కువైతే  ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పెరుగును వేయండి. 

sugar

చక్కెర

మీరు చేసిన కూరలో ఉప్పు ఎక్కువగా ఉందని అనిపిస్తే అందులో కొద్దిగా పంచదారను కలపండి. పంచదార ఉప్పు రుచిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. టేస్ట్ కూడా ఎక్కువగా మారదు. కానీ చక్కెరను మరీ ఎక్కువగా వేయకూడదు.

ఆలుగడ్డ

బంగాళాదుంపలతో కూడా మీరు కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఉడకబెట్టిన బంగాళాదుంపల తొక్కతీసి గుజ్జుగా చేయండి. దీన్ని ఉప్పగా ఉండే కూరగాయలో వేసి కలుపుకుంటే ఉప్పు రుచి తగ్గి కూరలు టేస్టీగా అవుతాయి.

బ్రెడ్ ముక్కలు

కూరలో ఉప్పును తగ్గించడానికి మీరు బ్రెడ్ ముక్కలను కూడా ఉపయోగించొచ్చు. అవును బ్రెడ్ ముక్కలు కూడా బంగాళాదుంపల మాదిరిగా ఉప్పును గ్రహిస్తాయి. అలాగే మీరు ఉప్పును తగ్గించడానికి కొబ్బరి పాలను కూడా ఉపయోగించొచ్చు. కొబ్బరి పాలు ఉప్పును తగ్గిస్తాయి. 

Latest Videos

click me!