Cleaning Tips: పప్పులు, ఉప్పు, కారం పొడి ఇలా ప్రతిదానికీ మనం ప్లాస్టిక్ డబ్బాలను వాడుతుంటాం. కానీ వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం. వీటిపై ఉన్న మరకలు అంత సులువుగా పోవు. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం వీటిని సులువుగా పోగొట్టొచ్చు.
పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలకే కాదు.. నెలకోసారైనా ఆడవాళ్లు వంటింటిని, అందులో ఉన్న సామాన్లను శుభ్రం చేస్తుంటారు. అయితే స్టీల్ సామన్లను క్లీన్ చేయడం ఈజీనే. కానీ వంటింట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను అంత సులువుగా క్లీన్ చేయలేం.
వంటింట్లో ఉండటం వల్ల వీటికి నూనె, మురికి బాగా అంటుకుపోతాయి. ఇవి అంత సులువుగా పోవు. వీటిని క్లీన్ చేయలేక ఆడవారు పాత వాటిని పారేసి కొత్తవాటిని కొనేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
24
కిచెన్ లోని డబ్బాలను ఎలా శుభ్రం చేయాలి?
గోరువెచ్చని నీళ్లు, వెనిగర్ తో..
మురికిగా మారిన ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీళ్లు, వెనిగర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం మీరు టబ్ వేడి నీళ్లను తీసుకుని అందులో రెండుమూడు టీ స్పూన్ల వెనిగర్ ను వేసి బాగా కలపండి. టబ్ కాబట్టి అందులో ఒకేసారి చాలా డబ్బాలను వేయొచ్చు. ఈ వాటర్ లో డబ్బాలను వేసి 20 నిమిషాలు నానబెట్టి తర్వాత చేతులతో రద్ది శుభ్రం చేయండి. అయితే నీళ్లు మరీ ఎక్కువ వేడిగా చేయకూడదు. దీనివల్ల డబ్బాలు కరిగిపోతాయి.
34
డిటర్జెంట్ పౌడర్ తో..
డిటర్జెంట్ పౌడర్ తో కూడా మీరు కిచెన్ లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ డిటర్జెంట్ పౌడర్ ను వేసి బాగా కలపండి. దీనిలో ప్లాస్టిక్ డబ్బాలను వేయండి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే రుద్ది క్లీన్ చేస్తే జిగట, మురికి అంతా పోతుంది. మీరు ఎక్కువగా రుద్దకున్నా డబ్బాలు క్లీన్ గా అవుతాయి.
డిష్ వాష్ లిక్విడ్ ను ఉపయోగించి కూడా మురికిగా మారిన ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయొచ్చు. ఇది డబ్బాలను తలతలా కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం రెండు టీ స్పూన్ల ఉప్పులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ ను వేసి బాగా కలపండి. దీన్ని క్లాత్ లేదా స్క్రబ్బర్ తో డబ్బాలకు అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత బ్రష్ తో డబ్బాలను రుద్ది శుభ్రం చయండి. దీనివల్ల డబ్బాలకు పట్టిన మురికి మొత్తం తొలగిపోతుంది. అలాగే వాటి నుంచి వాసన కూడా రాదు.