రైస్ వాటర్ తో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. దీన్ని ఎలా పెట్టాలంటే?

Published : Jun 06, 2023, 04:05 PM IST

బియ్యం నీరు మన చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే ప్రత్యేక పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.   

PREV
18
రైస్ వాటర్ తో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. దీన్ని ఎలా పెట్టాలంటే?
Hair growth

రైస్ వాటర్ ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ వాటర్ చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో ఏండ్ల నుంచి చైనా, జపాన్ మహిళలు జుట్టు పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు రైట్ వాటర్ ను ఉపయోగిస్తూ వస్తున్నారు. రైస్ వాటర్ లో జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. 

28

రైస్ వాటర్ ఎందుకంత ప్రత్యేకం

సైన్స్ డైరెక్ట్ ప్రకారం.. బియ్యం నీటిలో 75 నుంచి 80% పిండి పదార్ధాలు ఉంటాయి. బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉడికించిన తర్వాత ఈ పిండి పదార్థం విడుదలవుతుంది. అలాగే వీటిలో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో అమైనో ఆమ్లాలు, బి విటమిన్లు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఫైబర్, జింక్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

38

దీనిపై పరిశోధన ఏం చెబుతుంది? 

ది విలే ఆన్లైన్ లైబ్రరీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బియ్యం నీటి వాడకం జుట్టు స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. డెర్మటాలజీ అండ్ థెరపీ 2019 లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. విటమిన్ బి 12 లేకపోవడం వల్ల జుట్టు ఫాస్ట్ గా రాలుతుంది. కాబట్టి బియ్యం నీటిలో ఉన్న పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే ఇతర పోషకాలు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

48

జుట్టు పెరుగుదలకు బియ్యం నీరు ఎలా సహాయపడుతుంది? 

రైస్ వాటర్ లో కార్బోహైడ్రేట్ అయిన ఇనోసిటాల్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. దీనిలోని పిహెచ్ స్థాయి జుట్టు పిహెచ్ స్థాయికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఇది జుట్టు రాలడాన్ని, విచ్ఛిన్నతను నివారిస్తుంది. బియ్యపు నీటిలో విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. దీని ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది మీ తల చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగు మంటను తగ్గిస్తుంది. ఇది చుండ్రును తగ్గించడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది. 
 

58

బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి?

1. 1/2 కప్పు బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రం చేయండి. ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లతో కడిగి నీళ్లలో వేసి ఒక గంట పాటు అలాగే వదిలేయండి.  తర్వాత బియ్యం అలాగే ఉంచి ఒక గిన్నెలోకి నీటిని ఒంపండి. అంతే దీన్ని జుట్టుకు పెట్టొచ్చు.

2.  అరకప్పు బియ్యంలో 1 కప్పుల నీళ్లు పోసి మరిగించండి. ఈ బియ్యాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. తర్వాత తరువాత బియ్యాన్ని, నీటిని వేరు చేయండి.

68


పులియబెట్టిన లేదా సాదా బియ్యం నీరు.. ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?

పులియబెట్టిన బియ్యం నీరే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2012 లో ఎండిపిఐ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పులియబెట్టిన ఏదైనా పదార్ధంలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పోగొడుతాయి. యాంటీఆక్సిడెంట్లు అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు.

పులియబెట్టిన బియ్యం తయారు చేయడానికి.. అర కప్పు బియ్యాన్ని 2 నుంచి 3 కప్పుల నీటిలో నానబెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 2 రోజులు ఉంచండి. ఆ తర్వాత నీటిని వడకట్టి వాడండి. 
 

78

బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలంటే? 

ముందుగా మీ జుట్టును షాంపూతో కడగండి. తర్వాత జుట్టును శుభ్రం చేయండి. ఇప్పుడు మీ జుట్టును బియ్యం నీటిలో ముంచండి. తర్వాత బియ్యం నీటితో తలకు మసాజ్ చేయండి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇప్పుడు తేలికపాటి గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.

88

బియ్యం నీటిని ఎన్ని రోజులకోసారి ఉపయోగించాలి?

జుట్టు బాగా పెరిగేందుకు,  జుట్టును బలోపేతం చేయడానికి, వెంట్రుకలు తెగిపోకుండా ఉండేందుకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దీనిని జుట్టుకు ఉపయోగించొచ్చు. దీనిని లీవ్-ఇన్ కండీషనర్ గా కూడా ఉపయోగించొచ్చు. 

click me!

Recommended Stories