Hair Care: షాంపూలు, కండిషనర్లు రాకముందు జుట్టు కోసం ఏం వాడేవారు? వారి హెయిర్ సీక్రెట్ ఏంటి?

Published : Jun 30, 2026, 12:55 PM IST

 Hair Care: జుట్టు రాలడం మొదలవ్వగానే చాలా మంది అప్పటి వరకు వాడే నూనెలు, షాంపూలు మార్చేస్తారు. ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడటం మొదలుపెడతారు. మరి, పూర్వం ఇలాంటివేవీ లేకుండా అమ్మమ్మలకు అంత ఎక్కువ జుట్టు ఎలా ఉండేది..? వారి సీక్రెట్ ఏంటి? 

PREV
13
Hair Care..

పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకునేవారు మనలో చాలా మంది ఉంటారు. అందుకోసం.. ఖరీదైన నూనెలు, షాంపూలు, కండిషర్లు అన్నీ వాడేస్తూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ మాత్రం ఆగదు. మరింత ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. కానీ.. మన అమ్మమ్మల కాలంలో.. ఇలాంటివి ఏమీ లేవు. వాళ్లు స్పెషల్ గా ఇలాంటివేమీ రాసినట్లు కూడా గుర్తు లేదు. కానీ.. వాళ్ల జుట్టు చాలా పొడువుగా, ఒత్తుగా ఉండేది. మరి... వాళ్ల జుట్టులాగా మన జుట్టు ఎందుకు లేదు..? వాళ్ల హెయిర్ సీక్రెట్ ఏంటి?

23
జుట్టు కోసం ఏం వాడేవారు..?

పూర్వం ప్రజలు తమ జుట్టును శుభ్రం చేయడానికి కేవలం ఒకే ఒక పదార్థంపై ఆధారపడేవారు కాదు.సహజంగా జుట్టు నిగనిగలాడటానికి, అందంగా ఉండటానికి సహజంగా దొరికే నూనెలు, మూలికలు ఉపయోగించేవారు. ప్రాచీన ఈజిప్టియన్లు తమ జుట్టును శుభ్రం చేయడానికి సుగంధ తైలాలను, మైనాన్ని ఉపయోగించేవారు. రోమన్లు తమ జుట్టు నుంచి మురికిని తొలగించడానికి నూనె ఉపయోగించి.. తర్వాత చర్మాన్ని , జుట్టును శుభ్రం చేయడానికి స్ట్రిజిల్ అనే లోహపు పరికరాన్ని వాడేవారు.

33
సబ్బుకి బదులు ఏం వాడేవారు...?

ఇప్పడంటే.. మనకు మార్కెట్లో చాలా రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. వాటితోనే స్నానం చేస్తున్నాం. కానీ... పూర్వం సబ్బు లేని రోజుల్లో స్నానం చేయడానికి బూడిదను ఉపయోగించేవారు. అంతేకాకుండా.. చర్మం నుంచి చమట, మురికిని తొలగించడానికి నీరు, ఇసుక, మట్టిని ఉపయోగించేవారు. సబ్బు లాగా నురగ వచ్చే మూలికలు, కొన్ని మూలికలు లభించేవి.. వాటిని కూడా ఉపయోగించేవారు.

ప్రాచీన నాగరికతలలో జుట్టు, చర్మానికి ఆలివ్ నూనెను వాడేవారు. ఈ నూనె కారణంగా చర్మానికి, జుట్టుకు మంచి తేమ లభిస్తుంది. అందుకే... ఎక్కువగా ఈ నూనెను ఉపయోగించేవారు.

Read more Photos on
click me!

Recommended Stories