Fan Cleaning: నిచ్చెన అవసరం లేకుండానే ఫ్యాన్ క్లీనింగ్...2 నిమిషాల్లో తళతళమంటాయి

Published : Jun 30, 2026, 12:06 PM IST

Fan Cleaning:  పండగో, పబ్బమో వస్తే ఈ సీలింగ్ ఫ్యాన్లు క్లీన్ చేయాలంటే తలనొప్పి. నిచ్చెన, కుర్చీలు ఎక్కి తుడవాలి. చేతులు లాగేస్తాయి. అయితే ఇకపై అంత శ్రమ పడకండి. నిచ్చెన లేకుండా దుమ్ము పడకుండా 2 నిమిషాల్లో శుభ్రం చేయొచ్చు.  ఫ్యాన్‌ తళతళా మెరిసిపోతుంది.

PREV
14
పిల్లో కవర్‌తో ఫ్యాన్ బ్లేడ్స్ క్లీనింగ్

పండగో, పబ్బమో వస్తే ఈ సీలింగ్ ఫ్యాన్లు క్లీన్ చేయాలంటే తలనొప్పి. నిచ్చెన, కుర్చీలు ఎక్కి తుడవాలి. చేతులు లాగేస్తాయి. అయితే ఇకపై అంత శ్రమ పడకండి. నిచ్చెన లేకుండా దుమ్ము పడకుండా 2 నిమిషాల్లో శుభ్రం చేయొచ్చు. ఫ్యాన్‌ తళతళా మెరిసిపోతుంది. అందులో మొదటిది పిల్లో కవర్‌తో ఫ్యాన్ బ్లేడ్స్ క్లీనింగ్. ఇది చాలా సులభమైన పద్ధతి. ముందుగా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత, ఓ పాత దిండు కవర్‌ను ఫ్యాన్ రెక్కకు పూర్తిగా తొడిగి, నెమ్మదిగా వెనక్కి లాగండి. రెక్కపై ఉన్న దుమ్ము మొత్తం కవర్‌లోకి వచ్చేస్తుంది. దీంతో ఇల్లంతా దుమ్ము పడకుండా పని పూర్తవుతుంది. అన్ని రెక్కలనూ ఇలాగే శుభ్రం చేసుకోవచ్చు.

24
వెనిగర్‌తో శుభ్రం చేయండి

మీ దగ్గర పాత సాక్స్ ఉంటే, దాన్ని చేతికి తొడుక్కొని, కొద్దిగా తడిపి ఫ్యాన్ రెక్కలను తుడవండి. లేదా, ఒక మైక్రోఫైబర్ క్లాత్‌ను సమాన పరిమాణంలో నీళ్లు, వైట్ వెనిగర్ కలిపిన మిశ్రమంలో ముంచి, గట్టిగా పిండి రెక్కలను తుడిస్తే దుమ్ముతో పాటు మరకలు కూడా పోయి కొత్తవాటిలా మెరిసిపోతాయి. 

34
స్ప్రే చేయండి
ఫ్యాన్ తుడిచాక, స్ప్రే బాటిల్‌లో కొద్దిగా నీళ్లు, కొన్ని చుక్కల ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ (లేదా Lucas Oil Slick Mist వంటి కార్ స్ప్రే) కలిపి రెక్కలపై స్ప్రే చేసి తుడవండి. ఇది ఒక 'యాంటీ-స్టాటిక్' పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల గాలిలోని దుమ్ము ఫ్యాన్‌కు సులభంగా అంటుకోకుండా ఉంటుంది. దీంతో ఫ్యాన్ ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది.
44
భద్రతా సూచనలు

ఫ్యాన్ శుభ్రం చేసే ముందు, కరెంట్ స్విచ్ ఆఫ్ చేశారో లేదో కచ్చితంగా చూసుకోండి. ఎత్తులో పనిచేసేటప్పుడు గట్టి స్టూల్ లేదా నిచ్చెన వాడండి. దుమ్ము, ధూళి ముఖంపై పడకుండా మాస్క్ ధరించడం చాలా మంచిది. లేకపోతే తుమ్ములు, జలుబు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories