Water : నీళ్లే సర్వరోగ నివారిణి అంటారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లను పుష్టిగా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడతారు.
27
నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల అధిక బరువును కోల్పోవడమే కాదు కిడ్నీల్లో రాళ్లు కూడా తొలగిపోతాయి. పుష్ఠిగా నీళ్లను తాగితే.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదట. ముఖ్యంగా శరీరానికి అవసరమైన నీళ్లను తాగడం వల్ల మెదడు, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
37
మనం రోజుకు ఎంత నీటిని తీసుకోవాలన్న విషయం శారీరక శ్రమ, శరీరతత్వం, వాతావరణం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
47
ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం మేల్కోగానే రెండు గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ఎక్సర్ సైజెస్ చేసే కంటే ముందే రెండు గ్లాసుల నీటిని తాగిగే అవయవాలు బాగా పనిచేస్తాయట. అలాగే భోజనం లేదా టిఫిన్ ఏదైనా కానీయండి.. తినేటప్పుడు కాకుండా తినడానికి ఇంకా అర్థగంట ఉండగా నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
57
స్నానం చేయడానికి ముందుగా నీళ్లను తాగితో అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇక నైట్ టైం నిద్రపోయే అర్థగంట ముందు గ్లాస్ నీళ్ల ను తాగాలి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు.
67
ముఖ్యంగా ఈ వేసవిలో నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఈ ఉక్కపోతలకు, దారుణమైన ఎండల ప్రభావంతో శరీరంలో ఉండే నీరంతా చెమట రూపంలో వెళ్లిపోతూ ఉంటుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ తో ఒక్కో సారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలా జరగకూడదంటే శరీరానికి సరిపడా నీటిని తాగుతూ ఉండాలి.
77
మూత్రం, చెమట, శ్వాసించడం వల్ల కూడా మన శరీరంలోంచి నీరు బయటకు పోతుంది. ఒంట్లో నీటి కంటెంట్ ఎక్కువగా లేకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయవు. కాబట్టి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి.