Side Effects of Ghee: నెయ్యిని వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Published : Apr 22, 2022, 04:58 PM IST

Side Effects of Ghee : నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం దీన్ని అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
16
Side Effects of Ghee: నెయ్యిని వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Side Effects of Ghee: దేశీ నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవే మన శరీరానికి మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు దీన్ని తినాలని సలహానిస్తుంటారు. 

26

నెయ్యి ఫుడ్ టేస్ట్ ను పెంచుతుంది. ఇకపోతే దీన్నిఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యిని కాలాలతో సంబంధం లేకుండా మోతాదులో తీసుకోవచ్చు. 

36

నెయ్యిలో విటమిన్ ఎ,  విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 9 ఫ్యాటీ ఆమ్లాలతో పాటుగా.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యి.. కొందరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మరి దీన్ని ఎవరెవరు తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా  తెలుసుకుందాం. 

46

హార్ట్ పేషెంట్.. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు సర్వరోగాలు చుట్టుకునే ప్రమదం ఉంది. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం సరైంది కానప్పుడే మన బాడీలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. గుండె జబ్బులతో బాధపడవారు నెయ్యిని తింటే Heart stroke వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితిలో నెయ్యిని తినకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

56

దగ్గు, జలుబు.. జలుబు, దగ్గు సమస్యలున్న వారు నెయ్యిని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యలున్నప్పుడు నెయ్యిని తినడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. 

66
LIVER

కాలెయ సమస్యలు.. కాలెయ సమస్యలతో బాధపడేవారు నెయ్యిని గానీ, ఆయిల్ ఫుడ్స్ గానీ అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని తింటే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు నెయ్యికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. 

click me!

Recommended Stories