raw onion Health benefits: వేసవిలో పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

Published : Apr 22, 2022, 04:22 PM IST

raw onion Health benefits: ఈ సీజన్ లో పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల జ్వరం, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

PREV
111
raw onion Health benefits: వేసవిలో పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

raw onion Health benefits: ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. అందుకే వీటిని ప్రతి వంటకంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లిలేని కిచెన్ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉల్లితో వంటలకు రుచి రావడమే కాదు.. మనల్ని ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. 

211

అందుకే హోటల్లో ఏదైనా ఫుడ్ సర్వ్ చేసినప్పుడు పక్కాగా ఉల్లిపాయలను పెడుతుంటారు. బిర్యానీ, బజ్జీలు, నూడుల్స్, స్ట్రీట్ ఫుడ్స్ లో పక్కాగా పచ్చి ఉల్లిపాయ ఉండనే ఉంటాయి. ఈ ఉల్లిపాయ టేస్ట్ కు జనాలు ఎప్పటినుంచో అలవాటు పడ్డారు. 

311

ముఖ్యంగా ఈ సీజన్ లో మజ్జిగ చేసుకుని అందులో సన్నగా ఉల్లిపాయలు తరిగి అందులో వేసుకుని తాగుతుంటారు. అయితే కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలను తింటున్నాం కానీ.. వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని.. నిజానికి పచ్చి ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఏ హానీ చేయవు. 

411

వీటిని తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుతుంది. అంతేకాదు సీజన్ లో వచ్చే ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది కూడా. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు డయాబెటీస్, క్యాన్సర్ వంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. 

511

జ్వరం, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గిస్తాయి. మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చి ఉల్లిపాయలను తింటే ఎన్నో రోగాలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచడానికి సహాయపడుతుంది. 
 

611

ఈ ఎండాకాలంలో పచ్చి ఉల్లిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

711

ప్రాణాంతకమైన క్యాన్సర్ కారకాలను ఎదుర్కోగల రసాయనాలు పచ్చి ఉల్లిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది  Digestive system పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. 

811

ఉల్లిలో మొక్కల ఆధారిత రసాయనాలు ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటుగా ఖనిజాలు, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. 

911

పూర్వకాలంలో ఈ ఉల్లిని నోటిపూత, హార్ట్ ప్రాబ్లమ్స్, జ్వరం, తలనొప్పి వంటి వాటిని నయం చేయడానికి ఉపయోగించేవారట. 

1011

ఉల్లిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే  ఇందులో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

1111

ఈ వేసవిలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది బాడీ ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉల్లిని ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 
 

click me!

Recommended Stories