ప్రతిరాత్రి ప్రశాంతంగా పడుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం కొందరు స్ట్రెయిట్ గా పడుకుంటారు. మరికొందరు బోర్లా పడుకుంటారు. కొంమతమంది కాల్లు ముడుచుకుని పడుకుంటారు. అయితే కాళ్లు ముడుచుకుని పడుకోవడం కరెక్టేనా? ఇలా పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం
గర్భిణీస్త్రీలు బోర్లా, వెళ్లకిలా పడుకోకూడదు. వీరు రాత్రి పడుకునేటప్పుడు కాళ్లను కొద్దిగా ఎడమవైపుకు వంచి పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వీరికి మంచి నిద్రవచ్చేలా చేస్తుంది. అలాగే బిడ్డ బరువుగా అనిపించడాన్ని కూడా తగ్గిస్తుంది.
sleeping
త్వరగా నిద్ర వస్తుంది
కొంతమంది నిటారుగా నిద్రపోతేనే చాలా త్వరగా నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి కాళ్లు ముడుచుకుని పడుకుంటేనే తొందరగా నిద్రపడుతుంది. అలాగే ఇది వారికి రిలాక్స్డ్ గా అనిపిస్తుంది.
sleeping
శరీర భంగిమపై ప్రభావం
రాత్రిపూట ఎక్కువ సేపు కాళ్లు ముడుచుకుని పడుకుంటే అది మీ శరీర భంగిమపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతకాలం తర్వాత మీరు సరైన భంగిమలో నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలి.
వెన్నునొప్పి సమస్య
రాత్రిపూట ఎక్కువ సేపు కాళ్లు ముడుచుకుని నిద్రపోవడం వల్ల నడుము బిగుసుకుపోతుంది. అలాగే నడుము కింది భాగంలో కూడా నొప్పి బాగా వస్తుంది. వెన్ను నొప్పి రాకూడదంటే మాత్రం మీరు కాళ్లను ముడుచుకుని పడుకోకూడదు.
పాదాల తిమ్మిరి
కాళ్లను ఎక్కువ సేపు ముడవడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీనివల్ల మీకు పాదాల్లో తిమ్మిరిగా అనిపిస్తుంది.
లేవడంలో ఇబ్బంది
కాళ్లను ముడుచుకుని పడుకోవడం వల్ల కొన్నిసార్లు అవి బరువుగా అనిపిస్తాయి. దీనివల్ల మీరు ఉదయం మంచం పై నుంచి లేవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
నిద్రకు సరైన మార్గం
రాత్రిపూట ముందుగా నడుముపైనే పడుకోవాలి. దీని తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ సేపు ఒకే వైపు పడుకోకుండా ఉండాలి.