నెయ్యి మంచిదే.. కానీ..ఇలా తీసుకుంటేనే.. !!

First Published | Mar 31, 2021, 12:35 PM IST

ఘుమఘుమలాడే నెయ్యిని ఇష్టపడనివారు ఉండరు. స్వీట్లు, ప్రత్యేకమైన వంటకాల్లో నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. వేడివేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి సూపర్ కాంబినేషన్. చెబుతుంటూనే నోట్లో నీళ్లురతాయి. అంతేనా.. అన్నం తిననని మారాం చేసే చిన్నపిల్లలకు వేడన్నం, పచ్చిపులుసులో నెయ్యి కలిపి తినిపిస్తే గుటుక్కున మాయం చేసేస్తారు.

ఘుమఘుమలాడే నెయ్యిని ఇష్టపడనివారు ఉండరు. స్వీట్లు, ప్రత్యేకమైన వంటకాల్లో నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. వేడివేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి సూపర్ కాంబినేషన్. చెబుతుంటూనే నోట్లో నీళ్లురతాయి. అంతేనా.. అన్నం తిననని మారాం చేసే చిన్నపిల్లలకు వేడన్నం, పచ్చిపులుసులో నెయ్యి కలిపి తినిపిస్తే గుటుక్కున మాయం చేసేస్తారు.
రోటి పచ్చళ్లతో, పప్పుచారుతో ఇలా నెయ్యి కాంబినేషన్స్ మన రుచికి తగినట్టుగా మారుతూ ఉంటుంది. భారతీయవంటిళ్లలో నెయ్యి లేకపోవడం అనేది అరుదు. చాలామంది ఇంట్లోనే నెయ్యినితయారు చేసుకుంటారు. ఆ అవకాశం లేనివాళ్లు రెడీమేడ్ గా దొరికే నెయ్యిని వాడతారు. ఏదేమైనా నెయ్యి వాడకం అనేది కామన్.

నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. నెయ్యి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలన్నా, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యవంతమైన జుట్టు, చర్మం కోసం నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. గర్బిణి స్త్రీలు నెయ్యి తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, ఒమెగా 3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
నెయ్యిని వాడి చేసే వంటకాల వల్ల ఎన్నో శక్తివంతమైన ప్రయోజనాలున్నాయని, పోషకాలు చక్కగా వెలికి వస్తయని ఆయుర్వేదంలో చెప్పబడింది.
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు.. ఇది నెయ్యి విషయంలోనూ వర్తిస్తుంది. మంచిది కదా అని ఎక్కువగా తింటే ప్రయోజనాలు తిరగబడే అవకాశం ఉంది. అందుకే రోజుకు ఎంత నెయ్యిని ఆహారంలో తీసుకోవాలి? ఎంత తీసుకుంటే ఎక్కువైపోతుంది? అనే విషయాలు తెలిసి ఉండాలి. అప్పుడే నెయ్యి ప్రయోజనాలు పూర్తిగా పొందగలుగుతాం.
మంచి కొవ్వు అయిన నెయ్యిని రోజూ ఆహారంలో వాడడం మంచిదే. రోజువారీ దీన్ని వాడడం వల్ల ఆరోగ్యప్రయోజనాలూ ఉన్నాయి. వంటకాల్లో కానీ లేదా ఉదయాన్నే కానీ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం చాలా మంచిది.
అయితే రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినొచ్చు అంటే.. RDA ప్రకారం పెద్దలు, గర్బిణిలు 2,3 చెంచాల నెయ్యి తినొచ్చు. చిన్నపిల్లలు, శిశువులు రెండు స్పూన్లకంటే ఎక్కువ నెయ్యి తీసుకోకూడదు.
సూపర్ న్యూట్రియంట్ అయిన నెయ్యి ఎక్కువగా తినడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే అందరికీ నెయ్యి పడకపోవచ్చు. కొంతమందిలో నెయ్యి వాంతులు అయ్యేలా చేస్తుంది. శరీరంలో కొవ్వును పెంచుతుంది. అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని వాడితే దాని అసలు ప్రయోజనాలు పొందవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారికి నెయ్యి అమృతతుల్యం అని చాలామంది భావిస్తుంటారు. అయితే నెయ్యి ఎక్కువగా తింటే బరువు తగ్గరు సరికదా.. పెరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు వెయిట్ లాస్ పాటిస్తున్నట్లైతే రోజుకు రెండు చెంచాల నెయ్యి కంటే ఎక్కువ మించకుండా తీసుకోవడం మంచిది.
శాఖాహరులు కాని వారు, గుండె సంబంధ సమస్యలున్న వారు నెయ్యికి దూరంగా ఉండడమే మంచిది. డయాబెటిస్ రోగులు, ఒబేసిటీతో బాధపడుతున్నవారు కూడా నెయ్యిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

Latest Videos

click me!