వీటితో కలిపి రోజూ గుడ్డు తింటే.. బరువు తగ్గడం చాలా సులువు..!

First Published | Mar 31, 2021, 12:22 PM IST

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
 

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కోడిగుడ్లలో ప్రోటీన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కాగా.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కోడిగుడ్డు బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్లలో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రెండు గుడ్లలో 25 శాతం ప్రోటీన్ ఉంటుంది.

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం మీ క్యాలరీలను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పరిశోధనల ప్రకారం తేలిన విషయం ఏమిటంటే.. రోజూ గుడ్డు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ ఉబకాయాన్ని నివారించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
గుడ్డులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇందులో జింక్ మరియు సెలీనియం వంటి రోగనిరోధక శక్తిని అందించే పోషకాలు కూడా ఉన్నాయి. గుడ్డుతో పాటు ఏ ఆహారం కలిపి తీసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలియాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూర, టమోటాలు, క్యాప్సికమ్, పుట్టగొడుగులతో కలిపి గుడ్లు తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గుడ్లు ఉడికించిన లేదా సలాడ్ తో కలిపి తీసుకోవడం బెస్ట్ అని సూచిస్తున్నారు.

Latest Videos

click me!