శృంగారాన్ని తనివితీరా ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. పడక గదిలో బెడ్ మీద మీ పార్ట్ నర్ అంతేలని కలయికను ఆస్వాదించాలంటే.. తాంత్రిక శృంగారం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రకం శృంగారం మెడిటేషన్ లా పనిచేసి.. కలయికను ఆసాంతం ఆస్వాదించేలా చేస్తుంది.మరి ఏంటీ తాంత్రిక శృంగారం.. దీనిని ఎలా ఆస్వాదించాలనే విషయం ఇప్పుడు చూద్దాం.
తాంత్రిక సెక్స్ అనేది మీ, మీ భాగస్వామి మధ్య సంబంధాన్ని బలపరిచేది. ఈ సెక్స్ నెమ్మదిగా, ధ్యాన రూపం నుంచి మొదలౌతుంది. ఇది మీ అన్ని ఇంద్రియాలపై దృష్టి పెడుతుంది. తర్వాత నెమ్మదిగా శ్వాసల ఆధారంగా మీ లైంగిక ప్రేరేపణను నియంత్రిస్తుంది. తాంత్రిక శృంగారం వల్ల కలిగే లాభాలు కూడా ఓసారి చూద్దాం..
తాంత్రిక సెక్స్ మీ మనస్సు లోపలి భాగంతో కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయపడుతుంది, ఇది మీ అంతర్గత ఆత్మతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయపడుతుంది. ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకుంటే ఇది సాధ్యమౌతుంది. నెమ్మదిగా శ్వాసించడం సాధన చేసినప్పుడు, మీరు చేసే సాధారణ సెక్స్ అడ్వెంచర్ కంటే సెక్స్ కంటే ఆహ్లాదకరంగా ఉంటుంది.
సెక్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది టెన్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.. అయితే.. తాంత్రిక శృంగారం.. మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేస్తుందట. మానసిక ప్రశాంతత కూడా దీనితో సొంతమౌతుంది. అంత గొప్ప శక్తి దీనిలో ఉంది. ఎలాంటి ఎమోషనల్, మెంటల్ స్ట్రెస్ కూడా దీని కారణంగా తొలగిపోతాయి.
తాంత్రిక సెక్స్ లో మొదటి రూల్ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటం. నెమ్మదిగా.. డీప్ బ్రీత్ తీసుకోవాలి. దీని వల్ల ఇద్దరి మద్య ఒకరకమైన కనెక్షన్ ఏర్పటానికి సహాయపడుతుంది. మనకు తెలీకుండానే ఏదో శక్తి ఆవహించినట్లు గా భావిస్తారు.
జీవిత భాగస్వామిని ఆనందపరచడం అంటే కేవలం శృంగారంతో సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అదే తాంత్రిక శృంగారంపై దృష్టి పెడితే.. ఆనందపు చివరి అంచుల వరకు ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ మానసిక ఆనందం పొందడానికి ఇది సహాయపడుతుంది.
అధిక ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడేవారికి, తాంత్రిక సెక్స్ చాలా సహాయపడుతుంది. ఇది వేగవంతమైన శృంగారాన్ని నెమ్మదిస్తుంది మరియు ఆందోళన కలిగించే వ్యక్తికి ఒక సమయంలో ఒక విషయంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది మరియు మెరుగైన పనితీరు కోసం నెమ్మదిగా శ్వాసను కూడా నియంత్రిస్తుంది.