పురుషుల చర్మ సంరక్షణ కోసం ఐదు చిట్కాలు...

First Published Sep 23, 2021, 1:19 PM IST

పురుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యువులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఆరోగ్యకరమైన చర్మం ఉంటుంది. దీనికి సరైన పోషణను ఇచ్చినప్పుడు ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీనికోసం సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించాలి. 

చర్మ సంరక్షణ కేవలం స్త్రీలకే పరిమితం కాదు, పురుషులకూ కావాల్సిందే. మామూలుగా పురుషుల చర్మం రఫ్ గా ఉంటుంది కాబట్టి దానికి అంత సంరక్షణ అవసరం లేదని అనుకుంటారు. అయితే పురుషుల చర్మానికీ చుట్టూ ఉన్నవాతావరణం, కాలుష్యం హాని కలిగిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నీరసంగా కనిపిస్తుంది. 

మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యువులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఆరోగ్యకరమైన చర్మం ఉంటుంది. దీనికి సరైన పోషణను ఇచ్చినప్పుడు ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీనికోసం సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించాలి. చర్మ సంరక్షణ విధానాలను పాటించాలి. అప్పుడే మీ చర్మానికి అద్భుతాలు చేయవచ్చు. మీరు కూడా టోన్డ్ స్కిన్ కావాలనుకుంటే... మచ్చలను తొలగించాలనుకున్నా, మీ చర్మాన్ని రోజంతా మెరుస్తూ ఉండాలని కోరుకుంటే మీరు పాటించాల్సిన ఐదు చిట్కాలు ఇక్కడున్నాయి. 

అన్ని రకాల చర్మాలకూ మాయిశ్చరైజేషన్ అనేది అవసరం. చక్కగా వ్యాయామం తర్వాత బాగా చెమట పట్టినప్పుడు.. మీ ముఖాన్ని సున్నితంగా తుడిచుకున్నా మీ చర్మం చికాకుగా అనిపిస్తుందా? ఇది వర్షాకాలంలో తేమ లేని పొడి చర్మం ఉన్నవారిలో కనిపించే ముఖ్యమైన లక్షణం. అవాంఛిత చర్మపు చికాకు, చర్మంపై పొడి పాచెస్ నివారించడానికి, పొడి చర్మం ఉన్న పురుషులు వారి అన్ని బహిర్గత శరీర భాగాలకు రిచ్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.

చర్మాన్ని బాగా క్లీన్ చేయడానికి మాస్క్ వేసుకోవాలి. ఆయిల్ ప్రొటెక్షన్ క్లే మాస్క్‌ను అప్లై చేయడం వల్ల మీ ముఖ చర్మానికి అద్భుతాలు చేయవచ్చు. క్లేలో మంచి మొత్తంలో ఆక్సిజన్ ప్రేరిత కణాలు, యాక్టివేటెడ్ చార్ కోల్ ఉంటుంది, ఇవి మృత చర్మ రంధ్రాలను శుభ్రపరచడమే కాకుండా పురుషుల ముఖ చర్మం లోపలి చర్మానికి సరైన ఆక్సిజన్ ను అందిస్తుంది. బంకమట్టిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా మీ చర్మం మరింత దెబ్బతినకుండా నిరోధిస్తాయి, దీంతోపాటు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

హైడ్రేట్ గా ఉండాలి. హైడ్రేషన్ అనేది చర్మ కణాలను పోషించడంలో కీలకం. వర్షాకాలంలో, గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాలనిపించదు. తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల తెలియకుండానే శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. అందుకే రోజుకు కనీసం 3-లీటర్ల నీటిని తాగేలా చూసుకోండి. దీనివల్ల పొడి చర్మం ఉన్న పురుషులు వేడి, వర్షాకాలం నుండి బయటపడొచ్చు. ఎందుకంటే గాలిలో అధిక తేమ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మీ చర్మం పొడిబారకుండా నిరోధించడానికి మీరు వేడి నీటితో స్నానం చేయడం మానుకోవాలి.

డిసిన్ఫెక్షన్ అండ్ క్లీనింగ్ అప్ : ఈ సీజన్ లో బాగా తేమ ఉంటుంది. అందుకే బైటికి వెళ్లివచ్చిన వెంటనే మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్నానం చేసేలా చూసుకోవాలి. ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడం వలన మీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ దూరంగా ఉంచుతుంది. అంతేకాదు బయటినుంచి వచ్చే మురికి చర్మానికి పట్టుకుని ఉండకుండా చూస్తుంది. బద్దకంగా అనిపించి బైటినుంచి వచ్చిన తరువాత స్నానం చేయకుండా ఉండడం అంత మంచిది కాదు అని కూడా వాళ్లు చెబుతున్నారు. 

గ్రూమింగ్ కిట్‌ను మర్చిపోవద్దు. ముఖం మీది అన్ని భాగాలకంటే గడ్డం కింద ఉండే చర్మం మృధువుగా ఉంటుంది. కాబట్టి మీ గడ్డాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది..  మీ చర్మ సంరక్షణా విధానంలో ముఖ్యమైన భాగాలలో ఒకటి. నాణ్యమైన రసాయన రహిత ప్రీ-షేవింగ్ ఆయిల్‌తో పాటు అధిక-నాణ్యత కలిగిన ట్రిమ్మర్‌ని ఉపయోగించడం వల్ల గడ్డాన్ని ఇష్టపడే ప్రతీ మనిషికి ఆందోళన కలిగించే విషయం. క్లీన్ షేవింగ్ లుక్‌ను ఇష్టపడినట్లైతే.. మృదువైన షేవ్ చేయడానికి ప్రీమియం రేజర్ బ్లేడ్‌లను వాడాలి. 

గ్రూమింగ్ కిట్‌ను మర్చిపోవద్దు. ముఖం మీది అన్ని భాగాలకంటే గడ్డం కింద ఉండే చర్మం మృధువుగా ఉంటుంది. కాబట్టి మీ గడ్డాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది..  మీ చర్మ సంరక్షణా విధానంలో ముఖ్యమైన భాగాలలో ఒకటి. నాణ్యమైన రసాయన రహిత ప్రీ-షేవింగ్ ఆయిల్‌తో పాటు అధిక-నాణ్యత కలిగిన ట్రిమ్మర్‌ని ఉపయోగించడం వల్ల గడ్డాన్ని ఇష్టపడే ప్రతీ మనిషికి ఆందోళన కలిగించే విషయం. క్లీన్ షేవింగ్ లుక్‌ను ఇష్టపడినట్లైతే.. మృదువైన షేవ్ చేయడానికి ప్రీమియం రేజర్ బ్లేడ్‌లను వాడాలి. 

click me!