ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు వాస్తును చూస్తాము. వాస్తు ఎంత బలంగా, లాభంగా ఉంటే ఆ ఇంట్లోనే వారు అంత సంతోషంగా జీవిస్తారు. ఇంట్లోని తలుపులు, కిటికీల సంఖ్య కూడా వాస్తు శాస్త్రం నిర్ణయిస్తుంది. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలో, కిటికీలు ఉండాలో ముందే వాస్తు శాస్త్రం వివరించింది. ఒక ఇంట్లో కిటికీలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి కాంతిని, గాలిని ఇంట్లోకి తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం తలుపుల తర్వాత కిటికీలకే ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని స్థిరంగా తీసుకురావడంలో ఇది సహకరిస్తాయి. కిటికీలు సరైన దశలో ఉండడం సరైన సంఖ్యలో ఉండడం కూడా చాలా అవసరం.
కిటికీలలాగే తలుపులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు లోపల శక్తి, శుభం, సంపద, ఆరోగ్యం పయనించే మార్గం ఇవే. తలుపులు సరిగా లేకపోతే సానుకూల శక్తి సరైన దిశలో ప్రవహించదు. ప్రధాన తలుపు (హౌస్ మైన్ డోర్) దిశ, ఆరంభం, కొలతలు కూడా చాలా ముఖ్యం. ఈ తలుపు సరిగా ఉండకపోతే ఇల్లు లోపల శక్తి అసమతుల్యంగా ఉంటుంది. దాని వల్ల ప్రభావం ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతిపై పడుతుంది.