ఒక వ్యక్తి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు బతుకుతాడో తెలుసా?

First Published Sep 6, 2024, 5:08 PM IST

ఏం తినకుండా, ఏం తాగకుండా ఎన్ని రోజులు బతుకుతారని ఎవరికైనా డైట్ వచ్చిందా? దీనికి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా?

 కొంతమంది వారం పది రోజులు కూడా అన్నం తినకుండా కేవలం నీళ్లు తాగి ఉంటారు. కానీ కొంతమంది తినకుండా అస్సలు ఉండలేరు.

కానీ మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఎలాంటి రోగాలు రాకుండా జీవించాలంటే మాత్రం ఫుడ్ ఖచ్చితంగా తినాలి. నీళ్లు పుష్కలంగా తాగాలి. ఈ రెండూ లేకుంటే మనం కొన్ని రోజుల్లోనే నీరసించి చనిపోతామని నిజం.

ఆరోగ్య నిపుణుల ప్రకారం..  ఎలాంటి వ్యాధులు లేని మనిషి ఎలాంటి ఫుడ్ ను తీసుకోకుండా ఎన్ని రోజులు బతుకుతారనేది ఖచ్చితంగా చెప్పలేం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధనలు కూడా జరగలేదు.

అయితే కొన్ని రికార్డుల ప్రకారం.. ఫుడ్ తినకుండా, నీళ్లు తాగకుండా.. ఒక వ్యక్తి 1 వారం నుంచి 3 వారాల వరకు జీవించొచ్చు. నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ఏం తినకుండా, నీళ్లు కూడా తాగకుండా కూడా బతకడం సాధ్యమే.

పురాతన కాలంలో మునులు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా. నీళ్లు తాగకుండా తపస్సు చేసినట్టు కథలు కథలుగా చెప్తారు. అయితే ఇది వయస్సు, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందట. కానీ  మనిషి జీవించడానికి ఆహారం, నీళ్లు చాలా చాలా అవసరం. 

ఎందుకంటే మనం తినే ఆహారం, నీళ్ల నుంచే మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే నీళ్లు తాగకుండా మాత్రం ఎక్కువ రోజులు బతకలేం. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన నీళ్లు ఇతర ఆహార పదార్థాల నుంచి అందుతుంది. అందుకే ఫుడ్ లేకుండా మనం ఎక్కువ రోజులు బతకలేం. 

ఫుడ్ తినకుండా. నీళ్లు తాగకుండా మనం కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే జీవించగలమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏమీ తినకుండా ఉంటే.. ఆకలి కాస్త హింసగా మారుతుంది. అలాగే శరీరంలో ఎన్నో  మార్పులు వస్తాయి.  

మన శరీరం బాగా పనిచేయాలంటే మత్రం రోజుకు అవసరమైన కేలరీలు అందుతాయి. కేలరీలు కరిగితేనే మనకు శక్తి అందుతుంది. ఇది మనం తినే ఆహారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

మన శరీరానికి అవసరమైన కేలరీలు అందకపోవడమే ఆకలి అంటే. ఈ ఆకలి వల్ల మన శరీరం లోపలి నుంచి దెబ్బతినడం మొదలవుతుంది.

మన శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆహారం అందుబాటులో లేనప్పుడు దానిని ఎదుర్కోవడానికి మన శరీరం భిన్నంగా ప్రవర్తిస్తుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కానీ సరైన సమయంలో పోషకాలు తిరిగి లభించకపోతే మాత్రం చనిపోయే ప్రమాదం ఉంది.

Latest Videos


అయితే మనిషి తినకుండా ఎన్ని రోజులు బతుకుతాడనే దానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. ఒకరు తినకుండానే పూర్తి శక్తితో పనిచేయగలుగుతారు. ఇది వారి గత జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

గతంలో పోషకాహారాన్ని తీసుకుని పూర్తి హెల్తీగా ఉంటే.. వీళ్లు తినకుండానే కొన్ని గంటలు యాక్టివ్‌గా ఉండగలుగుతారు.  తినకుండా అలసట లేకుండా చురుగ్గా ఉండటం ప్రతి ఒక్కరి శరీరంపై ఆధారపడి ఉంటుంది.

అయితే ఇది వయస్సును బట్టి మారొచ్చు. ఎక్కువగా 24 గంటల వరకు ఆహారం లేకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతారు. ఆ తర్వాత మీరు కొన్ని రోజులు బతకొచ్చు. కానీ సంతోషంగా జీవించలేరు.  

నిపుణుల ప్రకారం.. తినకుండా, నీళ్లు తాగకుండా ఒక వారం మాత్రమే బతకగలమట. ఫుడ్ తినకుండా కేవలం నీళ్లు తాగి ఉండేవాళ్లు 2 వారాల నుంచి 3 నెలల వరకు కూడా బతకొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే నీళ్లు మీ శరీరంలో ఇప్పటికే ఉన్న కొవ్వు, ప్రోటీన్ల మొత్తం మీ జీవితకాలాన్ని పెంచుతాయి. ఈ విషయంలో సన్నగా ఉన్న వ్యక్తి కంటే లావుగా ఉన్న వ్యక్తి ఆయుష్షే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. తినకుండా 3 వారాలు మాత్రమే బతకగలుగుతారు. నీళ్లు కూడా తాగని వారు 3 నుంచి 4 రోజులే బతకగలరని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే,నీళ్లు తాగి ఆహారాన్ని మాత్రం తినకుండా ఉండేవారు కేవలం 3 వారాలు జీవించగలరని పరిశోధకులు నమ్ముతున్నారు.  

కొంతమంది కొన్ని రోజులు లేదా వారాలు ఆకలితో ఉన్నా బతకగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఏమీ తినకుండా ఉండటం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయట. తినకుండా ఉండటం వల్ల కడుపులో ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

దీంతో అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి ఏమీ తినకపోవడం వల్ల తల తిరగడం, మైకం వంటి తాత్కాలిక సమస్యలు వస్తాయి.

ఇంకొంతమందికి థైరాయిడ్‌ సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శారీరక బలహీనత, గుండెపోటు కూడా రావొచ్చు. 

click me!