అసలు మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా?

First Published Sep 6, 2024, 4:15 PM IST

కొంతమంది అప్పుడే చెప్పిన విషయాలను కూడా మర్చిపోతుంటారు. ఇక రెండు మూడు రోజుల విషయాలైతే గుర్తుకే ఉండవు. అసలు మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా?
 

dementia

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఇది మనం ఆలోచించడానికి, అవగాహన, గుర్తుంచుకోవడం,  నేర్చుకోవడానికి బాధ్యత వహిస్తుంది. అయితే మన రోజువారి వారి అలవాట్లలో కొన్ని మన మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఇవి హానికలిగిస్తాయన్న ముచ్చట చాలా మందికి తెలియదు. అసలు ఏ అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి? ఏవి అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు దారితీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిద్ర లేమి

నిద్రలేమి సమస్య ప్రస్తుత కాలంలో చాలా మందికి ఉంది. కానీ నిద్ర మన మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. తగినంత నిద్రపోకపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. అలాగే జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం తగ్గుతుంది. అందుకే పెద్దలు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని డక్టర్లు చెప్తారు. 

అనారోగ్యకరమైన ఆహారం

అనారోగ్యకరమైన ఆహారం మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర, ఉప్పులు ఉంటాయి. ఇవన్నీ మన మెదడులోని రక్త నాళాలను దెబ్బతీస్తాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.అందుకే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఇవి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Latest Videos


dementia

శారీరక శ్రమ

మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ కూడా చాలా అవసరం. శారీరక శ్రమ ఒక్క బాడీనే కాకుండా.. లోపలి అవయవాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెదడులో కొత్త న్యూరాన్లు పెరుగుతాయి. అలాగే మీ జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం కూడా పెరుగుతుంది. 

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో ఒత్తిడి ఒక సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఇది మన మెదడు ఆరోగ్యాన్ని కూడా బాగా దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు కణాలను దెబ్బతీస్తుంది.

అలాగే జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం,  లోతైన శ్వాస వంటివి చేయండి. ఇవి ఒత్తిడిని తొందరగా తగ్గిస్తాయి. 
 

dementia

స్మోకింగ్

స్మోకింగ్ చేసే అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. స్మోకింగ్ వల్ల మెదడులోని రక్త నాళాలు దెబ్బతింటాయి.  ధూమపానం అల్జీమర్స్,  చిత్తవైకల్యం వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 

dementia general

ఆల్కహాల్ 

మందును ఎక్కువగా తాగే అలవాటు మిమ్మల్నిలేనిపోని రోగాల బారిన పడేస్తుంది. మందును ఎక్కువగా తాగితే మెదడు కణాలు కూడా దెబ్బతింటాయి. అలాగే జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం కూడా తగ్గుతాయి. మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు మందులు లిమిట్ లో తాగాలి. లేదా పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. 

memory loss

సోషల్ మీడియాను విపరీతంగా వాడటం..

అవును సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించినా కూడా మీ మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ అలవాటు మీ మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం కూడా తగ్గుతుంది. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం, దాని నుంచి బ్రేక్ తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి అవసరం. 

click me!