కీర్తి సురేష్ సన్నబడటానికి ఏం చేసిందో తెలుసా?

First Published | Jun 3, 2024, 12:49 PM IST

ఒకప్పుడు కీర్తి సురేష్ బొద్దుగా, ముద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నజాజిలా సన్నగా, అందంగా మారిపోయింది. అసలు ఈ అమ్మడు బరువు తగ్గడానికి ఏం చేస్తుందో తెలుసా? 
 


డ్రీమ్ గర్ల్ గా తమిళ తెరకు పరిచయమైన కీర్తి సురేష్ టాలీవుడ్ లో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు మొదట్లో కొంచెం బొద్దుగా ఉండేది.  రెమో, సామి 2 సినిమాల తర్వాత మాత్రం బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి కీర్తి సురేష్ బొద్దుగా ఉండటమే ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. కీర్తి సురేష్ బొద్దుగా ఉంటేనే అద్దంగా ఉందని కామెంట్స్ ను కూడా ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయినా కీర్తి సురేష్ మాత్రం బరువు తగ్గింది. 
 

బరువు తగ్గడానికి కీర్తి ఏం చేసింది

కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతుంది. నిజానికి కీర్తి సురేష్ ఫిట్ నెస్ ఔత్సాహికురాలు. ఈమె బరువు తగ్గడానికి ఫిట్నెస్, డైట్ ప్లాన్ ను బాగా ఫాలో అయ్యింది. అసలు కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


యోగా

కీర్తి సురేష్ బరువు తగ్గడానికి వారానికి ఒకసారి జిమ్ కు వెళ్లడం మానేసింది. కానీ ఆ రోజు నుంచి రోజూ యోగా క్లాసుకు వెళ్తుంది. పూర్తి అంకితభావంతో యోగా సాధన చేయడమే కీర్తి సురేష్ పర్ఫెక్ట్ ఫిజిక్ కు ప్రధాన కారణట.

పవర్ లిఫ్టింగ్

కీర్తి సురేష్ స్లిమ్ గా కనిపించినా.. ఈ అమ్మడు స్ట్రెంత్ లిఫ్టింగ్ తో సహా జిమ్ ఎక్సర్ సైజుల్లో కూడా పాల్గొంటుంది. ఇది ఆమె శారీరక బలాన్ని బాగా పెంచుతుంది. 
 

కార్డియో శిక్షణ

కీర్తి సురేష్ వెయిట్ లాస్ జర్నీలో ఎన్నో కార్డియో ఎక్సర్ సైజులను కూడా చేస్తుంటుంది. ఈ కార్డియో శిక్షణ శరీరంలోని కొవ్వును త్వరగా కరిగిస్తుంది. బరువు పెరగకుండా కాపాడుతుంది. 
 

నిద్రలేచిన వెంటనే

కీర్తి సురేష్ ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతుంది. ఆ తర్వాత ఒక గ్లాసు పాలతో పాటుగా తృణధాన్యాలను తింటుంది. ఇది రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.


లంచ్, డిన్నర్

కీర్తి సురేష్ మధ్యాహ్న భోజనం బయట అస్సలు చేయదు. ఈ బ్యూటీ ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. ఇకపోతే ఈమె  రాత్రి భోజనానికి పోషకాలుండే సూప్, జ్యూస్ లేదా స్మూతీని తాగుతుంది. ఇవి ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఇష్టమైన ఆహారం

కీర్తి సురేష్ కి కొన్ని ఆహారాలంటే చాలా ఇష్టం. ఈమెకు ఇష్టమైన ఆహారాలు వెజిటేబుల్ దోశలు, పిజ్జా.
 

click me!