కొంతమంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం కుక్కలకు దూరంగా ఉంటారు. కుక్కలను చూస్తేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే కుక్కలు కరుస్తాయని. కానీ అన్ని కుక్కలు ప్రమాదకరమైనవి కావు. ప్రమాదకరమైన కుక్కకు, సాధరణ కుక్కకు చాలా తేడాలు ఉంటాయి. కానీ జనాలకు ఇవి తెలియవు. ముఖ్యంగా వీధి కుక్కలను చాలా మంది క్రూరమైనవిగా, పిచ్చికుక్కలుగా భావిస్తారు. వీధి కుక్కలే మనుషులను కరిచి ప్రాణాలను తీస్తాయని అనుకుంటారు. కానీ ప్రతి వీధి కుక్క ఇలాగే ఉండదు. కానీ కుక్క కరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు హస్పటల్ కు వెళ్లాలి.
నిజానికి పిచ్చి పట్టిన కుక్కను చాలా ఈజీగా గుర్తించొచ్చు. పిచ్చి లేని కుక్క మనం అరిస్తే మొరగడం, మీదికి రావడం ఆపేస్తుంది. అదే పిచ్చి కుక్క అయితే అది మనం ఏం చేసినా మీదికి రావడం ఆగదు. కరుస్తుంది కూడా.
మన దేశంలో చాలా వీధి కుక్కల స్వైర విహారం జనాలకు భయం కలిగిస్తోంది. చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి చంపిన ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు పెంపుడు కుక్కలు కూడా దాడిచేస్తుంటాయి. ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. అందుకే పిచ్చి కుక్కకు, సాధారణ కుక్కకు తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కుక్క కరిచినప్పుడు కూడా ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
dog attack
కుక్క కాటును తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది ప్రాణాలను సులువుగా తీసేయగలదు. అందుకే ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. నిపుణుల ప్రకారం.. రేబిస్ వైరస్ వల్లే ఒక మంచి కుక్క.. పిచ్చి కుక్కగా మారుతుంది. చాలా కుక్కలు కుళ్లిపోయిన జంతు మాంసాన్ని తింటుంటాయి. కానీ వీటిలో రేబిస్ వైరస్ ఉంటుంది. చాలా రోజులుగా కుళ్లిపోయిన జంతు మాంసంలో రేబిస్ వైరస్ ఉంటుంది. వీటిని తిన్న కుక్కల శరీరానికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో మంచి కుక్కలు.. పిచ్చి కుక్కలుగా మారుతాయి.
పిచ్చి కుక్కకుండే లక్షణాలు
కుక్కకు పిచ్చి పడితే బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడూ నోట్లోనుంచి లాలాజలం, నురగ వస్తుంటాయి. ఈ కుక్కలు ఏదీ తినవు. అయితే ఈ రేబిస్ వైరస్ సోకిన కుక్క ఒకటి రెండు వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పిచ్చికుక్క రోజుకు 100 మందిని కూడా కరవగలదట. ఈ లక్షణాలన్నీ సాధారణ కుక్కలో కనిపించవు. పిచ్చి పట్టిన కుక్కలే ఇలా చేస్తాయి.