జస్ట్ వారంలో డార్క్ సర్కిల్స్ ను పోగొట్టే ఎఫెక్టీవ్ చిట్కాలివి..!

First Published | Mar 19, 2024, 10:45 AM IST

ప్రస్తుతం చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ వీటివల్ల ముఖం అందం తగ్గుతుంది. మీరు ఎంత అందంగా ఉన్నా.. ఇవే కనిపిస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వీటిని కేవలం వారంలోనే తగ్గించుకోవచ్చు. ఎలాగంటే? 
 

ఆడవాళ్లకు కళ్లే అందం. కళ్లే అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతేనే కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి. దీనివల్ల మీ ముఖం అందం తగ్గుతుంది. అలాగే మీకు ఏదో వ్యాధి ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. అందుక డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి చాలా మంది కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి చర్మానికి, ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చాలా సింపుల్ గా డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బంగాళాదుంప ఐస్ క్యూబ్

కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు పోవాలంటే వారానికి రెండుసార్లు బంగాళాదుంప ఐస్ క్యూబ్స్ తో కళ్లచూట్టూ మసాజ్ చేయండి. బంగాళదుంపలు డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బంగాళాదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మన స్కిన్ ను ప్రకాశవంతంగా ఉంచుతాయి. డార్క్ సర్కిల్స్ ను కూడా పోగొడుతాయి. 

Latest Videos


బంగాళాదుంప ఐస్ క్యూబ్స్ ను తయారు చేయాలంటే.. ముందుగా పెద్ద బంగాళాదుంపలను తీసుకుని తొక్కతీసి తురమండి. దీంట్లో కొన్ని నీళ్లు పోసి రెండింటిని బాగా కలపండి. ఐస్ క్యూబ్ తయారీ కంటైనర్ పోసి ఫ్రిజ్ లో పెట్టండి. బంగాళాదుంప మిశ్రమం ఐస్ క్యూబ్ గా మారిన తర్వాత ఉపయోగించండి. ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు కళ్ల చుట్టూ వీటితో మసాజ్ చేయండి. ఇది మీకు పోషణను అందిస్తుంది. స్కిన్ ను రక్షిస్తుంది. 
 

కీరదోసకాయ నూనె

కీరదోసకాయ నూనెతో కూడా మీరు డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవచ్చు. కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా చేయాలంటే ముందుగా కీరదోసకాయ తొక్క తీసి బాగా తురుముకోవాలి. అప్పుడు కీరదోసకాయ రసాన్ని మాత్రమే తీయడానికి జల్లెడను ఉపయోగించండి. ఈ జ్యూస్ లో అలోవెరా జెల్ మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. దీన్ని రాత్రి పడుకునేటప్పుడు లేదా ఉదయం కూడా ఉపయోగించొచ్చు. 
 

dark circles

తేనె, కాఫీ పౌడర్

డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి తేనె, కాఫీ పౌడర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో తేనె, కాఫీ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, డార్క్ సర్కిల్స్ కు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఈ పద్దతి డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుంది. 
 

ఈ పద్దతులలో ఏ ఒక్కదాన్ని ఉపయోగించినా వారంలో డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోగలుగుతారు. ఇది కాకుండా రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. అలాగే మీ ఆహారంలో పోషకమైన ఆహారాన్ని చేర్చండి. ఇవి మీ కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా చూస్తాయి.
 

click me!