చాలా మంది మా సెక్స్ లైఫ్ బాలేదు.. చాలా బోరింగ్ ఉంది అంటూ.. చెబుతుంటారు. అయితే.. అందుకు మీరు ఎంత వరకు మీ వంతు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా కీలకమే. గుడ్ సెక్స్ లైఫ్ ఉండాలని అందరూ కోోరుకుంటారు.
sex
అయితే.. అది సాధ్యం కావాలంటే.. మీరిద్దరూ ఒకరికొకరు ఎంత మేరకు సమయం కేటాయించుకుంటున్నారనేది కూడా చాలా ముఖ్యం. అసలు పడక గదిలో రెచ్చిపోవడానికి ముందు.. గది బయట కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గది బయట రొమాన్స్ పండితే.. అప్పుడు.. పడక గదిలో రెచ్చిపోవడం సులభంగా ఉంటుందని వారు చెబుతున్నారు. పడక గదిలో రెచ్చిపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
sex
ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్స్ చేస్తుంటారు. లేదంటే ఎవరి ఫ్రెండ్స్ తో వారు వారికి నచ్చినట్లు షాపింగ్ చేస్తుంటారు. అలా కాకుండా.. ఇద్దరూ కలిసి షాపింగ్ చేయాలట. అలా చేయడం వల్ల.. ఒకరిపై ఒకరికి ఆకర్షణ.. సన్నిహితం పెరుగుతుంది. ఆ తర్వాత.. అది పడక గదిలో రెచ్చిపోవడానికి సహాయపడుతుంది.
ఇద్దరూ కలిసి వంట చేసుకోవడం... వంట చేయడం శ్రమ అని కొందరు అనుకుంటారు.. అసలు వంటలో ఏముందిలో అని మరికొందరు అనుకుంటారు. కానీ.. ఇద్దరూ కలిసి వంట చేయడం వల్ల.. వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం.. పడక గదిలో కచ్చితంగా చూపిస్తుందని వారు చెబుతున్నారు.
అంతేకాదు.. ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడం లాంటివి చేయడం వల్ల కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల అందం, ఆరోగ్యంతో పాటు.. సెక్స్ పరంగా కూడా ఇద్దరూ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇద్దరూ కలిసి చేయడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయి
What to Eat After Workout
వారం మొత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆ పని ఒత్తిడి కారణంగా కూడా పడక గదిలో ఆనందంగా గడిపే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి.. వీకెండ్స్ లో ఇద్దరూ కలిసి సరదాగా ట్రిప్ కి వెళ్లాలి. అది ఒక్కరోజు అయినా.. సరదాగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దాని వల్ల ఇద్దరి మధ్య సెన్సువల్ ఫీలింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం పడకగదిలో కచ్చితంగా ఉంటుంది.
ఇక చివరగా.. సరదాగా ఇంట్లోనే ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం లాంటివి చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏది చేసినా ఇద్దరూ కలిసి చేయాలి అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. అలా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం వల్ల ఒకరిని మరొకరు తాకడం లాంటి పనుల వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగే అవకాశం ఉంటుంది.