జుట్టు పెరగానికి బెస్ట్ ఆయిల్ ఇది..!

First Published Jan 6, 2024, 10:35 AM IST

ఒత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలకుండా చేయడమే సాహసంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో జుట్టును పెంచడం సాధ్యమేనా అని చాలా మంది అంటుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు పొడుగ్గా పెరగడం ఖాయమేనంటున్నారు నిపుణులు. 

మన జుట్టు పొడుగ్గా, ఒత్తుగా కనిపించాలని మనమందరం కోరుకుంటాం. ఇందుకోసం ప్రతిరోజూ ఎన్నో రకాల జుట్టు సంరక్షణ చిట్కాలను కూడా పాటిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అయితే జుట్టు పెరగడం స్టార్ట్ కావాలంటే మీరు మార్కెట్ లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ నే వాడక్కర్లేదు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి కూడా జుట్టును పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు. 

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి ఇంట్లోనే నూనెను తయారుచేసి వాడొచ్చు తెలుసా? అవును ఈ నూనెను మీ జుట్టుకు రాత్రంతా పెట్టి ఉదయం స్నానం చేస్తే.. కొద్ది రోజుల్లోనే జుట్టు పెరగడం మీరు గమనిస్తారు. ఇంతకీ ఆ నూనె ఎంటీ? దాన్ని ఎలా తయారుచేయాలి? ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జుట్టు పొడవుగా పెరగడానికి ఎలాంటి పదార్థాలు వాడాలి?

ఆవ నూనె
కలబంద జెల్


కలబంద జెల్ ను జుట్టుకు అప్లై చేస్తే ఏమవుతుంది?

కలబంద జెల్ లో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-బి లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల జుట్టుకు పోషణ బాగా అందుతుంది.  దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టును హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.అలాగే కలబంద జెల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టును అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి కూడా.

ఆవ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆవనూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది జుట్టుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టుకు పోషణ అందించి.. జిడ్డును తగ్గించడానికి సహాయపడుతుంది.

జుట్టు పెరగడానికి నూనెను ఎలా తయారుచేయాలి. 

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మీ జుట్టుకు ఎంత నూనె పడుతుందో చూసుకుని గిన్నెలో పోయండి. దీంట్లో కలబంద నుంచి జెల్ ను తీసి కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత 
ఈ నూనెను జుట్టు నెత్తిమీద జుట్టు పొడవంతా అప్లై చేయండి. అయితే రాత్రి పడుకునే ముందు దీన్ని పెట్టండి. ఉదయం లేవగానే షాంపూతో జుట్టును వాష్ చేయండి. షాంపూ తర్వాత కండీషనర్ ను అప్లై చేసి జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. ఈ పద్దతిని తరచుగా ఫాలో అవ్వడం వల్ల మీ జుట్టు పొడవు పెరగడం ప్రారంభమవుతుంది.

గమనిక - ఏదైనా రెసిపీని ప్రయత్నించే ముందు.. మీరు నిపుణుడిని సంప్రదించాలి. అలాగే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.

click me!