కొరియన్ కల్చర్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో. కొరియన్ స్కిన్ కేర్, టీవీ షోలు, మ్యూజిక్ నేటి యువతరాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. బీటీఎస్ నుంచి టెన్ స్టెప్ స్కిన్ రొటీన్ల వరకు.. జనాల హృదయాలను గెలుచుకున్న ఈ కొరియన్ పోకడలు ప్రజలను బాగా ఆకర్షించాయి. అలాగే వారికి అభిమానులను చేశాయి. కానీ మీకు తెలుసా? కొరియన్ లైఫ్ స్టైల్ ను మనం పాటిస్తే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. కొరియన్ లైఫ్ స్టైల్ లో ఎలాంటి అలవాట్లు పాటిస్తే మనం ఫిట్ గా ఉండొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చురుకైన జీవనశైలి
కొరియాలో జనాలు ఎక్కువగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు వెళ్లడానికి సైకిళ్లను బాగా ఉపయోగిస్తారు. మనలా బైక్ లను అయితే కాదు. అయితే గుండె ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సైక్లింగ్ తో బరువు తగ్గడమే కాకుండా కాళ్ల కండరాలను కూడా టోనింగ్ చేయొచ్చు. అందుకే చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లేటప్పుడు బైక్ కాకుండా సైకిళ్లను ఉపయోగించండి. ఈ సైక్లింగ్ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.
Image: Getty Images
పులియబెట్టిన ఆహారం
కొరియన్లు తమ ఆహారంలో కిమ్చిని చేర్చుకుంటారు. ఇది పులియబెట్టిన ఆహార పదార్థం. నిజానికి పులియబెట్టిన ఆహార పదార్థాలు మన గట్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గట్ లో ఉన్న బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పులియబెట్టిన ఆహార పదార్థాలు కూడా డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. పెరుగు,ఊరగాయలు వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చండి.
ఫారెస్ట్ బెడ్డింగ్
ఫారెస్ట్ బెడ్డింగ్ అనేది కొరియాలో చాలా ప్రసిద్ధి చెందింది. అంటే దీనిలో ప్రకృతితో గడపడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారన్న మాట. అందుకే మీరు పగటిపూట కొంత సమయం ప్రకృతిలో గడపడానికి కూడా ప్రయత్నించండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
భాగ నియంత్రణ
కొరియన్ సంస్కృతిలో.. ఆహార భాగాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. దీని సహాయంతో మీరు బరువు సులువుగా తగ్గొచ్చు. కాబట్టి మీ ఆహార భాగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి. దీనితో మీరు అతిగా తినే ప్రసక్తే ఉండదు. అలాగే మీ బరువు కూడా తగ్గుతుంది.
హెర్బల్ టీ
కొరియన్ సంస్కృతిలో టీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీళ్లు ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టీనే తాగడానికి ఇష్టపడతారు. హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు రోజూ తాగే చక్కెర టీ అలవాటును మానేసి మూలికా టీని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు రిలాక్స్ అవుతారు.