Beauty Tips: నేటి తరం అమ్మాయిలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ముఖం మీద రంధ్రాలు. చక్కని ఫేస్ ప్యాక్ తో ఆ సమస్య కనిపించకుండా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి.
నేటి కాలం యువతులు చాలా రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం విపరీతమైన కాలుష్యం విపరీతమైన ఎండ.. కారణం ఏదైనా చర్మానికి మాత్రం ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. అందులోని ఎండకి, కాలుష్యానికి బాగా ఎక్స్పోజ్ అయ్యేది మొఖం అందువల్ల ముఖానికి ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా పడుతుంది.
26
దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖంపై అసహ్యకరమైన గుంటలు పడటం ఇవి వృద్ధాప్య రూపాన్ని ఇస్తాయి మరియు ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపించేలాగా చేస్తుంది. మొహం పై గుంటలని ఎదుర్కోవటానికి అనేకమార్గాలు ఉన్నాయి.
36
ముఖ్యంగా కొన్ని రకాల ఫేస్ మాస్క్ లను అప్లై చేయడం ద్వారా ఈ సమస్యని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ముఖంపై ఉన్న అగ్లీ ఫిట్ను దాచటంలో సహాయ పడే కొన్ని ఫేస్ మాస్కులని చూద్దాం రండి. ఇందులో ఒక రకం మాస్క్ ని అవకాడో మరియు తేనే మిశ్రమంతో ముఖానికి పట్టించి పదినిమిషాలు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
46
ఇలా చేయటం వలన చర్మం లో అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు రంద్రాలను బిగుతుగా చేస్తుంది. బొప్పాయి, బియ్యం పిండితో తేనెను కలిపి ఫేస్ మాస్ లాగా పెట్టుకొని 20 నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయటం వలన ముఖం మీద రంధ్రాలు తగ్గుముఖం పడతాయి.
56
అలాగే కాఫీ పౌడర్, కోకో పౌడర్ మరియు పెరుగు కలిపి 20 నుంచి 30 నిమిషాల వరకు ఫేస్ ప్యాక్ పెట్టుకొని తర్వాత చల్లని నీటితో మొహం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఎలాస్టిసిటీ మెరుగుపడుతుంది రంధ్రాలను బిగించి చర్మం మెరిసే లాగా చేస్తుంది.
66
అలాగే శనగపిండి, పాలు, పోట్స్ పౌడర్ తో కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాబట్టి కంగారు పడి బ్యూటీ పార్లర్ కి వేలకు వేలు తగలెయ్యకుండా ఇంట్లోనే ఈ మాస్కులు తయారుచేసి ఫలితాన్ని మీరే చూడండి.