దగ్గు వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి

Published : Jul 25, 2022, 04:58 PM IST

ఈ సీజన్ లో జలుబుతో పాటుగా దగ్గు కూడా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో దగ్గుకు చెక్ పెట్టొచ్చు. 

PREV
17
దగ్గు వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దగ్గు, జలబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు పెద్దలనే కాదు చిన్న పిల్లలను కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి అంత సులువుగా వదిలిపోవు. అందులో జలుబు, దగ్గు పక్కాగా వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉంటాయి.

27

అయితే జలుబు, దగ్గు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా అంత తొందరగా తగ్గవు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో దగ్గను సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

ఉప్పు నీటితో పుక్కిలించడం

దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో ఉప్పు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పద్దతి ద్వారా నోటిలో ఉంచే చెడు బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనికోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో అర టీస్పూన్ ఉప్పును వేసి.. నోటిలో పోసుకుని పుక్కిలించండి. 
 

47

అల్లం నీటిని సిప్ చేయండి

దగ్గును తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి దగ్గును నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

57

Betadine gargle

ఇది కూడా దగ్గును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది బ్యాక్టీరియాను చంపేయడంతో పాటుగా గొంతు నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. దగ్గు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చిట్కాలను ఫాలో అయితే తొందరగా దగ్గు తగ్గిపోతుంది. 
 

67

దగ్గు సమస్య ఎక్కువైతే రెండు టీ స్పూన్ల తిప్పతీగ రసాన్ని నీటిలో కలుపుకుని ఉదయం పూట తాగితే మంచి ఫలితం ఉంటుంది.దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

77

మిరియాల కాషాయం కూడా దగ్గును తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా నెయ్యిని తీసుకుని అందులో అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని వేసి తినాలి. 

Read more Photos on
click me!

Recommended Stories