ఇలా చేస్తే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..!

First Published | Apr 17, 2024, 5:12 PM IST

ఎలాంటి కెమికల్స్ లేకుండా.. ఇంట్లోనే ముఖ్యంగా మన వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో దోమల బెడద నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

కాలంలో సంబంధం లేకుండా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి దోమలే. ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలీదు.. సాయంత్రం అయితే చాలు.. దోమలు ఇంట్లోకి అడుగుపెట్టేస్తాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి అంటే.. ఈ దోమలు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ దోమల కారణంగా సాయంత్రం తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తోంది. మనం బయటకు వెళ్లకపోయినా.. అవి ఎలా వచ్చేస్తాయో తెలీదు.. ఇంట్లోకి దూరిపోతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ దోమలతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే.. ఎలాంటి కెమికల్స్ లేకుండా.. ఇంట్లోనే ముఖ్యంగా మన వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో దోమల బెడద నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 


1.కాఫీ పొడి..
కాఫీ పొడి ఉండని ఇల్లు ఉండదు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దాదాపు అందరు ఇళ్లల్లో కాఫీ  పొడి ఉంటుంది. అయితే... ఈ కాఫీ పొడితోనే దోమలను తరిమి కొట్టచ్చు.  కాఫీ పొడి వాసనకు దోమలు పారిపోతాయి.  మీరు కనుక.. రెండు స్పూన్ల  కాఫీ పొడిని ఒక గిన్నెలో తీసుకొని దానిని కాల్చాలి. అప్పుడు వచ్చే పొగకు దోమలు పారిపోతాయి. చాలా సేపటి వరకు మీ ఇంట్లో మళ్లీ దోమలు కనిపించవు. కావాలంటే ప్రయత్నించి చూడండి

Latest Videos


Garlic


2.వెల్లుల్లి..
మనం వంటకు ఉపయోగించే మరో వస్తువు వెల్లుల్లి. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే.. ఈ వెల్లుల్లితోనే దోమలను తరిమి కొట్టచ్చంటే మీరు నమ్ముతారా? కొన్ని వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి నీటిలో ఉడకబెట్టాలి. దీని తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నీటిలో వేయాలి. దీని తర్వాత దోమలు వచ్చే చోట స్ప్రే చేయాలి. ఇంటి మూలలో లేదా ఏదైనా రంధ్రంలో ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. అంతే.. దోమలు పరారౌతాయి.

3. లవంగాలు..
ఇక మనకు ఇంట్లో లవంగాలు సులభంగానే లభిస్తాయి. ఈ లవంగాలను ఇంట్లో పలు ప్రదేశాల్లో ఉంచండి. లవంగాల వాసనకు కూడా దోమలు తొందరగా ఇంట్లోకి రావు.  ఇంట్లో కిటికీలు.. కిచెన్, హాల్ టేబుల్స్ పై వీటిని ఉంచండి. అంతే.. దోమలు పరారౌతాయి.
 

neem oil


4.వేప నూనె..
మీరు దోమలను నివారించడానికి వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని స్ప్రే బాటిల్‌లో ఉంచి ఇంట్లో చల్లుకోవచ్చు. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు బయటకు వెళ్ళే ముందు మీ శరీరానికి దీన్ని అప్లై చేసుకోవచ్చు.

5.కర్పూరం.
నూనెలో కర్పూరం వేసి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. మీరు ప్రతిరోజూ సాయంత్రం ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. కావాలంటే ఈ మిశ్రమాన్ని ఇంట్లో కూడా స్ప్రే లాగా చల్లుకోవచ్చు. కర్పూరం వాసనకు దోమలు పారిపోతాయి. ఈ హోం ట్రిక్స్ పాటించడం వల్ల... మీరు దోమలను పారద్రోలవచ్చు.
 

click me!