Weight loss: వర్కౌట్స్ లేకుండా బరువు తగ్గడానికి సింపుల్ టిప్స్..!

Published : Jun 20, 2022, 02:24 PM IST

వ్యాయామం చేయడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే.. అవేమీ లేకుండానే కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల  సులభంగా బరువు తగ్గవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

PREV
16
  Weight loss: వర్కౌట్స్ లేకుండా బరువు తగ్గడానికి సింపుల్ టిప్స్..!

వ్యాయామం చేయాలి అనుకునేవారికి అందరూ ఇచ్చే సలహా.. వ్యాయామం చేయమని. సరైన ఆహారం తీసుకొని, వ్యాయామం చేయడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే.. అవేమీ లేకుండానే కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల  సులభంగా బరువు తగ్గవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

26

1.ప్లేట్ పరిమాణం...: భోజనం చేసే ప్లేట్ చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి. అది కూడా గుండ్రంగా ఉంటే.. పోర్షన్ డివైడ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఆ ప్లేట్ లో.. ప్రోటీన్స్,  కూరగాయలు లాంటివాటిని అన్నింటిని సమానంగా ఉండేలా చూసుకోవాలి. విభిన్న రకాల పోషక ఆహారాన్ని ఆ ప్లేట్ లోకి ఉండేలా చూసుకోవాలి. 
 

36

మరింత ప్రోటీన్ కోసం ఎంపిక చేసుకోండి: ప్రొటీన్ అనేది సంతృప్తతకు సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. ప్రొటీన్‌ని తగినంతగా తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు మీరు నిండుగా, ఆరోగ్యంగా ఉండగలరు. సులువుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

46

ఎక్కువ ఫైబర్ తినండి: ఫైబర్ తీసుకోవడం సంతృప్తిని కలిగించడమే కాకుండా మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

56

జంక్ ఫుడ్ కి దూరం: స్నాక్స్ వంటి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది. దానికి బదులు.. వాటి స్థానంలో పండ్లు తీసుకోవడం ఉత్తమం. చిప్స్, వేయించిన ఆహారాలు, సోడాలు వంటి అనారోగ్యకరమైన చిరుతిళ్లను ఆశ్రయించకుండా ఉండేలా  చూసుకోవాలి.
 

66

ఒత్తిడిని నివారించండి,బాగా నిద్రపోండి , హైడ్రేటెడ్ గా ఉండండి: నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డీ హైడ్రేటెడ్ గా ఉండటం మీ బరువు , ఆకలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడి , నిద్ర లేమి బరువు పెరుగుట, ఆందోళన, కేలరీలు అనారోగ్యకరమైన వినియోగం మొదలైన వాటికి దారితీస్తుంది. కాబట్టి ముందుగా ఒత్తిడి తగ్గిచుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి. నీరు ఎక్కువగా కూడా తీసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గవచ్చు.

click me!

Recommended Stories