లూస్ మోషన్స్ తో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..

First Published Sep 23, 2022, 4:23 PM IST

లూస్ మోషన్స్ ను తగ్గించుకోవడానికి మెడిసిన్స్ కంటే.. ఇంటి నివారణా చిట్కాలే బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. 
 

కొంతమందికి కొన్ని రకాల ఆహారాలను తినగానే లూస్ మోషన్స్ అవుతూనే ఉంటాయి. ఏకంగా రోజుకు 15 నుంచి 20 సార్లు విరేచనాలు అయ్యే వారు కూడా ఉన్నారు.  రోజుకు మూడు నాలుగు సార్లు వెళ్లడం వల్ల పెద్ద నష్టమేమి లేదు కానీ.. ఇంతకు మించితేనే శరీరం లో నీటి శాతం తగ్గుతుంది. అలాగే విపరీతమైన అలసట కలుగుతుంది. దీనివల్ల బెడ్ పై నుంచి లేవడానికి కూడా చేతకాదు. శరీరం శక్తి లేకుండా మారిపోతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది లూస్ మోషన్స్ ను ఆపే మెడిసిన్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి ఒక్కోసారి సమస్యను తగ్గించపోవచ్చు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. అవేంటో తెసుకుందాం పదండి. 
 

ఈ చిట్కాలను తెలుసుకునే ముందు అసలు లూస్ మోషన్స్ ఎందుకు అవుతాయో తెలుసుకోవాలి. సాధారణంగా ఆహారపు అలవాట్ల వల్ల లూజ్ మోషన్స్ అవుతాయి. కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా.. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే కూడా లూజ్ మోషన్స్ అవుతాయి. ఆయిలీ ఫుడ్స్, కారంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు, శరీరంలో మెగ్నీషియం పరిమాణం పెరిగినప్పుడు కూడా లూజ్ మోషన్స్ అవుతాయి. 

నీరు

మోషన్స్ పెట్టినప్పుడు శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. మీకు తెలుసా..? శరీరంలో నీటి శాతం తగ్గితే లూస్ మోషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నీళ్లను ఎక్కువగా తాగండి. దీంతో మీ శరీరానికి శక్తి అందుతుంది. లూస్ మోషన్స్ కూడా తగ్గుతాయి. 

నిమ్మరసం

నీళ్లను తాగలేని వారు నిమ్మరసం తాగొచ్చు. నిమ్మరసం మన  శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇందుకోసం నిమ్మరసంలో నీళ్లు పోసి, పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా చేస్తుంది. అంతేకాదు మీ శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. మీకు తెలుసా నిమ్మరసం విరేచనాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. విరేచనాలు తగ్గాలంటే రోజుకు 2 నుంచి 3 సార్లు నిమ్మరసం తాగండి. ఇది శరీరంలో ఖనిజాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

పండ్ల రసం, మజ్జిగ

వీటితో పాటుగా మజ్జిగ లేదా పండ్ల రసం కూడా విరేచనాలను తగ్గిస్తుంది. మోషన్స్ తగ్గాలంటే మీ శరీరంలోకి ఎక్కువ ద్రవాలు వెళ్లేలా చూసుకోండి. అయితే పండ్ల రసాలను తాగితే.. ఇంట్లోనే తయారుచేసుకోవడం మంచిది. బయటదొరికే జ్యూస్ ప్యాకెట్ ను యూజ్ చేయకండి. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే ఈ జ్యూస్ లో పోషకాలు కూడా ఎక్కువగా ఉండవు. 
 

మఖానా

లూస్ మోషన్స్ ను తగ్గించడానికి మఖానా కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మఖానా అనేది తామర పువ్వు విత్తనం. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 
 

దానిమ్మ పండు, ఆకు

లూస్ మోషన్స్ తో బాధపడేవారు దానిమ్మ పండును తినడం మంచిది. ఈ దానిమ్మ గింజలు శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. ఇక లూస్ మోషన్స్ ను తగ్గించడానికి దానిమ్మ ఆకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి.. తాగాలి.

click me!