పరిగడుపున లవంగాలను తింటే ఎన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసా

First Published Sep 23, 2022, 2:59 PM IST

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని పరిగడుపున తినడం వల్ల మీరు ఊహించలేని ప్రయోజనాలను పొందుతారు తెలుసా..?
 

లవంగాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. లవంగాల నూనె కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే శ్వాస, జీర్ణక్రియ వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.  లవంగాలలో యూజెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఈ లవంగాలు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వల్ల కలిగే మంటను తగ్గించడానికి సహయపడుతుంది. అలాగే గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలైన జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ లవంగాలను పరిగడుపున నమిలితే ఎన్నో రోగాలు నయమవుతాయట. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

పరిగడుపున లవంగాలను నమలడం వల్ల కొత్త కణాలు పెరుగుతాయి. అలాగే కాలెయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  వీటిలో ఉండే థైమోల్, యూజెనాల్ వంటి క్రియాశీల సమ్మేళనాల కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

షుగర్ అదుపులో ఉంటుంది

ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది తక్కువ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇన్సులిన్ స్రావం, బీటా కణాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
 

వికారం తగ్గుతుంది

అనారోగ్యంతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపున లవంగాలను నమలడం వల్ల దీనిలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు వికారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

లవంగాలు అనాల్జేసిక్ లక్షణాలుంటాయి. ఇది నోటి వాపు, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. అంతేకాదు లవంగాలు నోటి దుర్వాసనను పోగొట్టే సామర్థాన్ని కూడా కలిగి ఉంటుంది. నిద్రలేచిన తర్వాత రెండు లవంగాలను నమలడం వల్ల చెడు శ్వాస పోతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోజంతా మీ నోటిని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుతాయి. నోటిలో మిగిలిపోయిన ఆహార కణాలు, ఫలకం, నోటిలో కలిసిన లాలాజలం నుంచి తయారైన జిగట పదార్థం పేరుకుపోకుండా నిరోధిస్తుంది కూడా. 

 జీర్ణక్రియను పెంపొందిస్తుంది 

లవంగాల్లో వేడి చేసే గుణం ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు పోతాయి. ఇవి జీర్ణ రసాల స్రావాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కడుపు  ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే లవంగాలను మాత్రం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే లవంగాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నెమ్మదిగా రక్తం గడ్డకట్టడం, విరేచనాలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటి మెథాక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది.  మెరుగైన గట్ ఆరోగ్యం, జీర్ణక్రియ, పోషకాల శోషణను ప్రోత్సహిస్తుంది.
కాబట్టి వీటిని మోతాదులోనే తినండి.
 

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

లవంగాల్లో ఫ్లేవనాయిట్లు, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముక సాంద్రతను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే ఎముక కణజాలాన్ని మరమ్మత్తు చేస్తాయి. అంతేకాదు కీళ్ల నొప్పిని తగ్గించడానికి లేదా నివారించడానికి కూడా సహాయపడతాయి. ఈ లవంగాలు వృద్ధులలో కండరాల నష్టాన్ని కూడా ఆలస్యం చేస్తాయి. లవంగాల నూనెతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 


రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది 

ఈ సీజన్ లో జలుబు, జ్వరం, బ్రాంకైటిస్, సైనస్, వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సర్వ సాధారణం. ఇలాంటి సమయంలో లవంగాలు తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు. లవంగంలో యాంటీ వైరల్, బ్లడ్ ప్యూరిఫైయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిసిటీని తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

click me!