జస్ట్ ఐదు నిమిషాల్లో ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ మీకోసం

First Published | Dec 23, 2023, 2:50 PM IST

చలికాలంలో ముఖం అందం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సీజన్ లో నీళ్లను సరిగ్గా తగకపోవడం వల్ల వాడిపోయినట్టుగా కనిపిస్తుంది. దీనికి తోడు చర్మం డ్రైగా మారుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ లో కేవలం ఐదు నిమిషాల్లోనే ముఖం అందంగా మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? 

skin care

చలికాలంలో మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఖరీదైన వస్తువులను వాడేవారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే కేవలం కొన్ని నిమిషాల్లో మీ ముఖం అద్దంలా మెరిసేలా చేసేలా చేసే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బొప్పాయి

చలికాలంలో బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇందుకోసం బొప్పాయిని తొక్క తీసి మెత్తగా రుబ్బుకోండి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఆ తర్వాత నార్మలో వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. 
 

Latest Videos


పసుపు

చలికాలంలో ముఖానికి పసుపును అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మీ ముఖం గ్లో అవుతుంది. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇందుకోసం కొద్దిగా పసుపును తీసుకుని అందులో కొద్దిగా పెరును వేసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తుంది.
 

tomato

టమాటాలు

చలికాలంలో ముఖాన్ని అందంగా చేయడానికి టమాటా జ్యూస్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం టమాటా జ్యూస్ ను తీసుకుని దూదితో ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మీ ముఖం గ్లో అవుతుంది.

తేనె

చలికాలంలో ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి తేనెను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయండి. ఆ తర్వాత ముఖానికి తేనెను పెట్టండి. కనీసం 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. 

besan face packs

శనగపిండి

చలికాలంలో శనగపిండిని ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా చేయొచ్చు. ఇందుకోసం శనగపిండిలో రోజ్ వాటర్, పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 5 నిముషాల తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.

click me!