Beauty Tips: ముఖంపై మచ్చలను సులువుగా వదిలించే చిట్కాలివిగో..

Published : Apr 29, 2022, 03:46 PM IST

Beauty Tips: ముఖంపై నల్లని మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికారణంగా ఎంత అందంగా రెడీ అయినా అందవిహీనంగానే కనిపిస్తాము. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. 

PREV
17
Beauty Tips: ముఖంపై మచ్చలను సులువుగా వదిలించే చిట్కాలివిగో..

ఒకప్పుడు మచ్చలు వయసు పైబడిన వారికి మాత్రమే వస్తాయని భావించేవారు. కానీ ఇప్పుడు ఈ మచ్చలు చిన్నవయసువారికి సైతం వస్తున్నాయి. దీనికి కారణం చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాలు ఉన్నాయి. దీనికి తోడు కాలుష్యం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల ముఖంపై మచ్చలు (Freckle) ఏర్పడుతుంటాయి. అయితే ఈ మచ్చలను తొలగించేందుకు వంటింటి చిట్కాలు (Home Remedies) బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే.. 

27

నిమ్మకాయ  (Lemon).. కాస్త నిమ్మరసం తీసుకుని దానిలో కాస్త తేనెను కలపండి. దీన్ని ముఖానికి అప్లైం చేసి 15 నిమిషాల తరవ్ాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేయండి. రోజుకు రెండు మూడు సార్లు  దీన్ని ముఖానికి అప్లై చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. మచ్చలు తగ్గేవరకు ఈ  మిశ్రమాన్ని ముఖానికి పెడుతూ ఉండాలి. 
 

37

నిమ్మరసంలో నేచురల్ల బ్లీచింగ్ గుణాలుంటాయి.  తేనే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈ రెండు కలిపిన మిశ్రమం మచ్చలను సులువుగా వదిలిస్తుంది. 

47

బంగాళాదుంప  (Raw Potato).. ఒక బంగాళాదుంపను తీసుకుని దాన్ని సగానికి కట్ చేయండి. ఆ కత్తిరించిన భాగంపై కొన్ని నీళ్లను పోయండి. ఆ బంగాళాముక్కను ముఖం పై రుద్దండి. ఆ తర్వాత పది నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఒక నెలరోజుల పాటు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తే.. ముఖంపై నల్లలమచ్చలు మటుమాయం అవుతాయి. 
 

57

ఉల్లిపాయలు  (Onion).. ముందుగా ఉల్లిగడ్డను తీసుకుని దాన్నిముక్కలుగా తరిగిపెట్టుకోండి. ఆ ఉల్లిముక్కను మచ్చలపై బాగా రుద్దండి. ఒక పదిహేను నిమిషాల పాటు ముఖంపై ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ముఖానికి ఉల్లిపాయ రసం అప్లై చేసతే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు వదిలిపోయే వరకు ఈ రెమిడీని ప్రయత్నించండి. 

67

ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. 

77

అలొవెరా జెల్.. కలబంద దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ముందుగా కలబంద గుజ్జును తీసి అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖాన్ని నీట్ గా కడిగి అప్లైం చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఈ  మిశ్రమాన్ని తరచుగా ఫేస్ కు పెట్టడం వల్ల మచ్చలు తగ్గిపోయి.. ఫేస్ గ్లో గా మారుతుంది. 

click me!

Recommended Stories