Weight Loss Drink: ఈ హోం డ్రింక్స్ తో మీ బొజ్జ ఇట్టే కరిగిపోతుంది తెలుసా..?

Published : Apr 29, 2022, 02:55 PM IST

Weight Loss Drink: అధిక బరువు నుంచి బయటపడాలనీ  చాలా మందికీ ఉంటుంది. కానీ ఇందుకోసం వ్యాయామాలను మాత్రం అస్సలు చేయరు. అయితే కొన్ని ఇంటి పానీయాలతో అధిక బరువుకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..   

PREV
16
Weight Loss Drink: ఈ హోం డ్రింక్స్ తో మీ బొజ్జ ఇట్టే కరిగిపోతుంది తెలుసా..?

Weight Loss Drink: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం పూర్తిగా మన ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేసాం. అందుకే మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, కొన్ని చెడు అలవాట్ల వల్ల నేడు ఎంతో మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. 
 

26

అయినా ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి కూడా. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే యువత సైతం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడి చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం ఆరోగ్యకరమైన ఫుడ్స్, వ్యాయామాలు చేస్తూ ఉంటే అధిక బరువు నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

36

బెల్లి ఫ్యాట్ ను కరిగించే హోం డ్రింక్స్.. బిజీ లైఫ్ కారణంగా జనాలకు ఎక్సర్ సైజెస్ లేదా వర్కౌట్స్ చేయడానికి సమయం ఉండటం లేదు. కానీ కొన్ని రకాల పానీయాలను తాగడం వల్ల కూడా వేగంగా బరువును కోల్పోవచ్చంటున్నారు నిపుణులు. వాటిని తయారు చేయడం కూడా చాలా సులువు. అవేంటంటే.. 
 

46

మజ్జిగ.. ఈ వేసవిలో మజ్జిగను తాగడం వల్ల చలువ చేయడంతో పాటుగా డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. అంతేకాదు ఇది బరువు తగ్గేందుకు కూడా దివ్య  ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. మజ్జిగలో షుగర్ కంటెంట్ అస్సలు ఉండదు. షుగర్ తీసుకోవడం వల్లే ఊబకాయం పెరుగుతుంది. 

56

తులసి గింజలు.. బెల్లీ ఫ్యాట్ ను వేగంగా కరిగించేందుకు తులసి గింజలు ఎంతో సహాయపడతాయి. వీటిని సాధారణంగా సబ్జా విత్తనాలు అని కూడా అంటారు ఈ గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలను నీటితో కలిపి తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. దీంతో మీ బరువు తగ్గే ప్రాసెస్ సులువు అవుతుంది. 
 

66

వేడినీళ్లు, నిమ్మకాయ.. ఉదయం నిద్రలేచి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. ఈ  వాటర్ తాగడం వల్ల శరీరంలో నీటి కొరత అస్సలు ఏర్పడదు. అంతేకాదు ఇవి  శరీరంలో ఉండే విషపదార్థాలను కూడా బయటకు పంపుతాయి. ఈ పానీయం ద్వారా జీవక్రియలు పెరుగుతాయి. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

click me!

Recommended Stories