Fire Accident: ఇంట్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఏం చేయాలి.?

Narender VaitlaPublished : May 18, 2025 2:30 PM

హైద‌రాబాద్ చార్మినార్‌కు స‌మీపంలోని ఓ ఇంట్లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 16 మంది మ‌ర‌ణించారు. ఈ అంశం దేశ‌వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని క‌లిగించింది. ప్ర‌ధాని మోదీ మొద‌లు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య నాయ‌కులంతా ఈ సంఘ‌ట‌న‌పై స్పందించారు.   

16
Fire Accident: ఇంట్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఏం చేయాలి.?

మీర్‌చౌక్ అగ్ని ప్ర‌మాదం నేప‌థ్యంలో ప‌లు ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అస‌లు ఇంట్లో అగ్ని ప్ర‌మాదాలు ఎందుకు జ‌రుగుతాయి? జ‌ర‌గ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.? ఒక‌వేళ అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

26
electric wire burning

విద్యుత్ ఉపకరణాల విష‌యంలో జాగ్ర‌త్త‌: 

ఇంట్లో అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో విద్యుత్‌కు సంబంధించిన‌వే ఉంటాయి. 

* ఒక్కో ప్లగ్ పాయింట్‌లో అనేక ప్లగ్‌లు పెట్టడం ప్రమాదకరం. దీని వల్ల షార్ట్ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

* చిన్న వైర్ల‌పై హీట‌ర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిని ఉప‌యోగించ‌కూడ‌దు దీనివ‌ల్ల షార్ట్ స‌ర్క్యూట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. 

* ఇంట్లో క‌చ్చితంగా MCB (Miniature Circuit Breaker) లు ఉపయోగించాలి.

* పాత లేదా డ్యామేజ్ అయిన విద్యుత్ తీగలను వెంటనే మార్చాలి.

36
gas burner

వంట గ‌ది విష‌యంలో జాగ్ర‌త్త‌లు: 

* గ్యాస్ సిలిండ‌ర్‌ను క‌చ్చితంగా కింద ఆఫ్‌లో ఉంచాలి. 

* వంట గ‌దిలో బాగా వెంటిలేష‌న్ ఉండేలా చూసుకోవాలి. గ‌దిలో గాలి బ‌య‌ట‌కు వెళ్లాలి. 

* ఒక‌వేళ గ్యాస్ సిలిండ‌ర్ నుంచి మంట‌లు వ‌స్తే నీటితో ఆర్ప‌కూడ‌దు. తడి టవల్ లేదా బ్లాంకెట్ లాంటి వాటిని మంట‌పై క‌ప్పేయాలి. 

46

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు: 

* ఫైర్ అలారాన్ని వెంటనే మోగించాలి లేదా అందుబాటులో ఉంటే ప్రెస్ చేయాలి.

* మంట చిన్న‌గా ఉంటే ఆర్పేందుకు ప్ర‌య‌త్నించాలి. మీ కంట్రోల్‌లో లేద‌నిపిస్తే వెంట‌నే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డ‌మే మంచిది. 

* ఫైర్ స్టేషన్‌కు వెంటనే కాల్ చెయ్యాలి – నంబర్: 101, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయాలి.

* అగ్ని ప్రమాదం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ వాడొద్దు. మెట్ల ద్వారా బయటకు రావాలి. 

56

ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు: 

* అపార్ట్‌మెంట్‌ల‌లో ఉండే వారు క‌చ్చితంగా ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్ వంటి ఉండేలా చూసుకోవాలి. 

* ఎమర్జెన్సీ రూట్ ఉండేలా చూసుకోవాలి. 

66

* గ్యాస్ లీక్ అవుతుందా.? లేదా అన్న వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 

* ఇంట్లో తీవ్ర‌మైన పొగ వ్యాపిస్తే ఊపిరి ఆడకపోవచ్చు. వెంటనే తడి వస్త్రంతో ముక్కు, నోరు కప్పుకొని తలవంచి బయటకు వెళ్లాలి.

అత్యవసర నెంబర్లు: 

ఫైర్ సర్వీస్ – 101

అంబులెన్స్ – 108

పోలీస్ – 100

Read more Photos on
click me!