Holi 2022: చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ హోలీ పండుగను ఘనంగా రెండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇకఈ పండుగ రోజున ఒకరిపై ఒకరు ఆనందంగా రకరకాల రంగులను చల్లుకుంటూ ఉంటారు.
అయితే మనం చల్లుకునే ప్రతి రంగుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంతకి ఏ కలర్ ఎలాంటి భావాన్ని తెలుపుతుందో తెలుసుకుందాం పదండి..
రెడ్ కలర్: ఈ ఎరుపు రంగును గులాల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రంగును హోలీలో వివాహిత మహిళలు నుదిటికి పెట్టుకుంటారు. అంతేకాదు ఈ హోలీలో పెళ్లికాని యువతులు తమ ప్రియమైన వారితో నుదిటిన పెట్టించుకుంటారు. ఈ రెడ్ కలర్ ప్రేమకు, అనుబంధాలకు, భావోద్వేగాలకు, అభిరుచికి, సాన్నిహిత్యానికి సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ హోలీ రోజు మీ ప్రియమైన వారితో హోలీని సెలబ్రేట్ చేసుకోండి.
గ్రీన్ కలర్: ఈ రంగును గ్రీన్ గులాల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రంగు అనుకూలతలను, పచ్చని పంటలను, సంతృప్తిని సూచిస్తుంది. ఈ గ్రీన్ కలర్ రంగులను దేవుళ్లకు కూడా సమర్పిస్తుంటారు. నూతన ప్రారంభాలకు, శ్రేయస్కును సూచిస్తుందని ప్రజలు నమ్ముతారు.
బ్లూ కరల్: బ్లూ కలర్ కు శ్రీ క్రిష్ణ పరమాత్మకు దగ్గరి సంబంధం ఉంటుందట. ఎందుకంటే.. క్రిష్ణుడి శరీర రంగు కూడా ఇదే కలర్ లో ఉంటుంది. అంతేకాదు ఈ కలర్ ను క్రిష్ణుడికి అంకితమిచ్చినట్టు పురాణాల్లో ఉంది. అందులోనూ ఈ పండుగను క్రిష్ణుడు కొలువున్న ప్రదేశాల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రంగు విశ్వాసం, ఆధ్యాత్మిక, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు.
ఎల్లో కలర్: ఎల్లో కలర్ చాలా మందికి ఫేవరెట్ కలర్. కాగా హోలీ పండుగకు ఈ రంగు కలర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రంగును దేవుళ్లకు అర్పిస్తారట. పసుపు రంగు శాంతికి, ఆనందానికి, శ్రేయస్సుకు , ప్రకాశానికి ప్రతీక. పసుపు రంగు లేకుండా హోలీని సెలబ్రేట్ చేసుకోవడం అసంభవమే.
పింక్ కలర్: ఇది అమ్మాయిల ఫేవరెట్ కలర్. ఈ గులాబీ రంగు తమ ఆనందాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఇది స్నేహానికి ప్రతీకగా కూడా భావిస్తారు. నిబంధనలు పెట్టని మీ స్నేహితుడిపై ఈ రంగును చల్లి హోలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
ఆరెంజ్ కలర్: ఈ రంగు బలాన్ని, సానుకూలతలకు ప్రతీక. ఈ రంగును ఎక్కువగా తమ ప్రియమైన వారిపైనే జల్లుతుంటారు. ప్రారంభాలకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అని ప్రజలు విశ్వసిస్తుంటారు.
వైలెట్ కలర్: సంపద, రాయల్టీని, వినాయానికి ఈ వైలెట్ కలర్ ప్రతీక. ఈ రంగును హోలీ సెలబ్రేషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది అందంగా కూడా కనిపిస్తుంది.