Mobile Phones: చెవులకు రెస్ట్ ఇవ్వకపోతే మీ పని మటాషే..

Published : Mar 13, 2022, 03:48 PM IST

Mobile Phones: మీ చెవులు ఎప్పుడూ బిజీ బిజీనే ఉంటాయా? అంటే.. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నారని.. మీకు తెలుసో తెలియదో.. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ను పెట్టుకుని చెవులకు రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం మీరు ఇన్ఫెక్షన్ , ఇన్ ఫ్లమేషన్,  ఇరిటేషన్ సమస్యల బారిన పక్కగా పడుతరు జాగ్రత్త..

PREV
18
Mobile Phones: చెవులకు రెస్ట్ ఇవ్వకపోతే మీ పని మటాషే..

Mobile Phones: ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే సెల్ ఫోన్ లేని ఇల్లు లేదనే చెప్పుకోవాలి. ఒక్కొక్కరికైతే.. రెండు రెండు ఫోన్లు ఉంటాయి. ఒక్కో ఫోన్లో రెండేసి సిమ్ములు. ఇది వారి వ్యక్తిగతం . అయితే ఒక ఫోన్ తో మాట్లాడుతుంటే ఇంకో ఫోన్ రింగవుతూ ఉంటుంది. మరి ఒక ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చేతులు కాళీగా ఉండవు కదా. 

28

అదే ఇయర్ ఫోన్ తో మాట్లాడితే చెవి బిజీగా ఉంటే చేతులు కాళీగా ఉంటాయి. ఒక పక్క ఫోన్ మాట్లాడుతూనే ఇంకో పక్క చేతులతో చాట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అంతా ఇయర్ ఫోన్స్ కే దక్కుతుంది.

38

రోజులో సగం సమయాన్ని ఫోన్ మాట్లాడటానికే కేటాయించే వారు చాలా మందే ఉన్నారు. అయినా ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ ఇలాగే ఉంది కదా. పైగా పనిలో ఏ చిన్న గ్యాప్ దొరికినా.. ఫోన్లలోనే తలదూరుస్తున్నారు. పైగా పక్కవాళ్లకు ఇబ్బంది కాకూడదని ఇయర్ ఫోన్స్ ను పెడుకుంటున్నారు. 

48

రోజులో పక్కాగా నాలుగైదు గంటలు ఇయర్ ఫోన్స్ చెవుల్లో మోగుతూనే ఉంటాయి. మరికొంతమంది తమ జాబుల్లో వీటిని పక్కాగా వాడాల్సి వస్తుంది. వాళ్లు పక్కాగా ఏడు నుంచి ఎనిమిది గంటలు హెడ్ ఫోన్స్ ను వాడాల్సి ఉంటుంది. ఇది పెట్టుకోవడం మొదట్లో ఇబ్బందిగా అనిపించకపోయినా.. రాను రాను పరిస్థితి దారుణంగా తయారవుతుంది. 
 

58


వీటిని గంటల తరబడి చేవుల్లో మోగించడం వల్ల .. మీకు అరిచినట్టుగా(పెద్దగా)మాట్లాడటం అలవాటు అవుతుంది. అంతేకాదు ఎదుటివాళ్లు చెప్పేది మీరు అస్సలు వినరు. ఊరికే చిరాకు పడుతుంటారు. ముఖ్యంగా ఈ అలవాటు కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య మీకు తెలియకుండానే చాలా దూరం పెరుగుతుంది. 

68

ఈ అలవాటు అలాగే కొనసాగితే కొన్నాళ్లకు చెవి వాపు, ఇన్ఫెక్షన్, దురద , ఇరిటేషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికి మూల కారణం మరెవరో కాదు.. మీ చెవుల్లో మోగే ఇయర్ ఫోన్స్ యే కారణం. మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా.. ఇదే వాస్తవమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.  ఈ సమస్యనే వైద్య భాషలో‘Swimmers Year’ అంటారు. ఈ సమస్య బారిన పడిన వాళ్లల్లో 12 శాతం మంది వినికిడి శక్తికి కోల్పోతున్నట్టు సర్వేలు తేల్చి చెబుతున్నారు. 

78

Western countries తో పోల్చితే మన దేశంలోనే ఈ సమస్య తీవ్రస్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. టెక్నాలజీని వాడుకోవడంలో తప్పేమీ లేదు కానీ.. అదే పనిగా వీటిని వినియోగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

88

అదేపనిగా చెవిలో పాటలు, మాటలు గంటల తరబడి మోగుతుంటే మాత్రం మీరు ఫ్యూచర్ లో హియరింగ్ మెషీన్ తో పక్కాగా సహజీవనం చేయాల్సి వస్తుందన్న ముచ్చటను జర యాదిల ఉంచుకుంటే మీకు మంచిది. 

click me!

Recommended Stories